pushpa2 Collections: హిందీలో టాప్‌ ప్లేస్‌కి పుష్ప 2 ఎంత కలెక్ట్‌ చేయాలో తెలుసా?

హిందీలో టాప్‌ ప్లేస్‌కి పుష్ప 2 ఎంత కలెక్ట్‌ చేయాలో తెలుసా?

Viswa
2 Min Read

pushpa2 Collections: అల్లు అర్జున్‌ ‘పుష్ప2’ సినిమా బాక్సాఫీస్‌ దుమ్మురేపుతోంది. ఈ సినిమా ఇప్పటికే 660 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా చిత్రంయూనిట్‌ చెబుతోంది. మరి..ముఖ్యంగా ‘పుష్ప 2’ సినిమా హిందీలో సంచనాలు క్రియేట్‌ చేస్తుంది. తొలి రోజు 72 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇలాఏ హిందీ సినిమాకు తొలి రోజు 72 కోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాలేదు. అలాగే మూడో రోజు, నాలుగో రోజు…హిందీలో ‘పుష్ప 2’ సినిమాకు 70 కోట్ల రూపాయాలకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ వచ్చాయనిట్రేడ్‌ వర్గీయులు చెబుతున్నారు. ఇప్పటికే పుష్ప ది రూల్‌ సినిమా హిందీలో 350 కోట్ల రూపాయల గ్రాస్‌కలెక్షన్స్‌ను సాధించిందని యూనిట్‌ చెబుతోంది. ‘పుష్ప 2’ (pushpa2 Collections)సినిమా హిందీ బాక్సాఫీస్‌ జోరు ఇలానే కొనసాగితే మాత్రం హిందీలో టాప్‌ గ్రాసర్‌ మూవీగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Pushpa2 Collections: పుష్ప 2 సినిమా బ్రేక్‌ ఈవెన్‌కు ఇంకా ఎంత కలెక్ట్‌ చేయాలి?

AlluArjun PushpaTheRule Review
AlluArjun PushpaTheRule Review

హిందీలో టాప్‌ ప్లేస్‌ !

ఈ ఏడాది విడుదలైన హారర్‌ కామెడీ హిందీ చిత్రం ‘స్త్రీ 2’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 850 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన హిందీలో చిత్రం కూడా ఇదే. ఈ సినిమా కేవలం హిందీలో 660 రూపాయల కోట్ల కలెక్షన్స్‌ వరకు రాబట్టింది. ఈ కలెక్షన్స్‌ను ‘పుష్ప2’ అధికమించినట్లయితే…హిందీలో అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన చిత్రంగా ‘పుష్ప 2’నిలుస్తుంది. ‘పుష్ప 2’ సినిమాకు హిందీలో కేవలం వీకెండ్‌ కంప్లీట్‌ అయ్యేవరకు మాత్రమే దాదాపు300 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. ఇదే ఊపు కొనసాగితే కేవలం హిందీలోనే 660 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను దాటడం అనేది సులభమైన విషయమే అవుతుంది.

 

వెయ్యికోట్ల క్లబ్‌లో పుష్ప 2

ఇక ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా ఇప్పటికే రూ. 750 కోట్లు కొల్లగొట్టిందని ట్రేడ్‌ చెబుతోంది. ఈ ప్రకారం ‘పుష్ప 2’ సినిమా సులభంగా వెయ్యికోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించవచ్చు. ఇప్పటివరకు దంగల్, బాహుబలి 2, జవాను, పఠాన్, కేజీఎఫ్, కల్కి2898..వంటి సినిమాలు మాత్రమేవెయ్యికోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ జాబితాలో చేరాయి. మరి…పుష్ప 2 కూడా ఈ ఫీట్‌ను సాధిస్తుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *