హూ ఈజ్‌ యువర్‌ టైప్‌….రష్మిక ‘ది గాళ్‌ ఫ్రెండ్‌’ సినిమా రిలీజ్‌ ప్రోమో రిలీజ్‌

Viswa

Web Stories

The Girlfriend Movie New Release date: రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ది గాళ్‌ఫ్రెండ్‌’. ఈ సినిమా రిలీజ్‌ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. 2024 డిసెంబరులోనే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. చివరిసారిగా ఈ ఏడాది సెప్టెంబరు 5న ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకున్నారు మేక ర్స్‌. కానీ ‘ది గాళ్‌ఫ్రెండ్‌’ సినిమా విడుదల వాయిదా పడింది.

తాజాగా ‘ది గాళ్‌ఫ్రెండ్‌’ సినిమాను ఈ ఏడాది నవంబరు 7న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించే క్రమంలో, ‘హూ ఈజ్‌ యువర్‌ టైప్‌’ అనే ఓ వినూత్న వీడియోను కూడ రిలీజ్‌ చేసి, ఆడియన్స్‌ అనెన్షన్‌ను గ్రాబ్‌ చేసే ప్రయ త్నం చేశారు చిత్రంయూనిట్‌. ఓ కాలేజీ స్టూడెంట్‌ ప్రేమకథ ప్రధాన ఇతివృత్తంగా ఈ ఈ ‘ది గాళ్‌ ఫ్రెండ్‌’ సినిమా కథనం సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో, దీక్షిత్‌ శెట్టి మరో లీడ్‌ రోల్‌ చేశాడు. రావు రమేష్, రోహిణీ..ఇతర కీలకపాత్రల్లో నటించారు. హేషబ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్‌ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos