ఓటీటీలో కాంతార చాఫ్టర్‌ 1

Viswa

Web Stories

Kantara Chapter1 ott: రిషబ్‌ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘కాంతార: చాప్టర్‌1’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఈ అక్టోబరు 31 నుంచి (2025 అక్టోబరు 31) ఈ సినిమా అమెజాన్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ (Kantara Chapter1 ott)లో స్ట్రీమింగ్‌ కానుంది. అధికారిక ప్రకటన వెల్లడైంది. ‘కాంతార:ఛాప్టర్‌ 1’ సినిమా అక్టోబరు 2న థియేటర్స్‌లో విడుదల కాగా, నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఈ అక్టోబరు 2న ‘కాంతార: చాఫ్టర్‌ 1’ థియే టర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌1’ రూపొందిన సంగతి తెలిసిందే.

‘కాంతార:చాప్టర్‌ 1’ సినిమా థియేటర్స్‌ పరంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల రూపా యలను కలెక్ట్‌ చేసింది. ఈ అక్టోబరు 31న ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమా ఇంగ్లీష్‌ వెర్షన్‌ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక రిషబ్‌ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటించగా, గుల్షన్‌ దేవయ్య, జయరాం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

కాంతార ప్రీక్వెల్‌ కాంతార చాప్టర్‌ 1 రివ్యూ

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos