Sahana sahana Song: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ (TheRajasaab) సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరింత స్పీడప్ చేశారు మేకర్స్. ఆల్రెడీ ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ఓ ట్రైలర్, సాంగ్ రాగా, కొత్తగా ‘సహన సహన’ అంటూ సాగే, మరో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట లిరికల్ వీడియోను కాకుండ, డైరెక్ట్‌గా వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.
ఇక సహన సహన సాంగ్ లాంచ్ ఈవెంట్ (SahanaSahana Song Launch Event) హైదరాబాద్‌లోని లులు మాల్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో ఈ చిత్రం దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, హీరోయిన్ నిధి అగ ర్వాల్, రిద్దికుమార్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఎస్ పాల్గొన్నారు.
ఈ సినిమాలోని పాటలు శ్రోతలను అలరిస్తున్నాయని, ఇందులో ముగ్గురు హీరోయిన్స్‌తో కలిసి ప్రభాస్ చేసిన ఓ సాంగ్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తామన్నట్లుగా తమన్ మాట్లాడారు.
ది రాజాసాబ్ సినిమా నుంచి విడుదలైన కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్నిస్తుందని, ‘ది రాజాసాబ్’తో ఈ సంక్రాంతి ‘రెబల్ సంక్రాంతి’ అవుతుందని దర్శకుడు మారుతి చెప్పారు.
ప్రభాస్ మూవీ రేంజ్ ఏంటో ‘ది రాజాసాబ్’ (TheRajasaab Movie) సినిమాతో ఆడియన్స్ చూస్తారని ఈ చిత్రం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు. హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశామని, జనవరి 8న ప్రీమియర్స్ ప్లాన్ చేశామని ఆయన తెలిపారు. ఈ చిత్రం హీరోయిన్స్ నిధి అగర్వాల్, రిద్ధికుమార్‌లు పాల్గొని, ‘ది రాజాసాబ్’ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.

Tylekeo188bet for the best odds! That’s what everyone is saying, so I’m here to see for myself. Let’s go to tylekeo188bet!
For those looking to game on the go, the jilibetdownload process is smooth. I was worried it’d be a pain, but it’s actually super simple. Check out their download process – you’ll be up and running in no time at jilibetdownload.