డర్టీ పీఆర్‌ గేమ్స్‌…ప్రభాస్‌ స్పిరిట్‌ స్టోరీ లీక్‌పై…సందీప్‌రెడ్డి వంగా ఫైర్‌!

Viswa
Sandeepreddyvanga spirit Movie controversyDeepika

ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ సినిమా సెట్స్‌కు వెళ్లకముందే ఇటు బాలీవుడ్‌..అటు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ…విషయం ఏంటంటే….‘అర్జున్‌ రెడ్డి, యానిమల్‌’ సినిమాలను తీసిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా లేటెస్ట్‌ మూవీ ‘స్పిరిట్‌’ (Sandeepreddyvanga spirit). ఈ సినిమాలో ప్రభాస్‌ హీరో. ఈ మూవీ కోసం ప్రభాస్‌ తొలిసారిగా పోలీసాఫీసర్‌ పాత్రలో నటించ నున్నాడు. ప్రభాస్‌ క్యారక్టరై జేషన్‌లోనూ డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు.

అయితే రీసెంట్‌గా ‘స్పిరిట్‌’ సినిమాలోని హీరోయిన్‌ అవకాశాన్ని బాలీవుడ్‌ అగ్ర కథానాయిక దీపికా పదుకొనె వద్దనుకున్నారని, ఇందుకు ‘స్పిరిట్‌’ (Spirit Movie) సినిమా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో ఆమెకు నెలకొన్ని క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ అని బాలీవుడ్‌ టాక్‌. అయితే ‘స్పిరిట్‌’ సినిమా విషయంలో సందీప్‌రెడ్డి–దీపికా పదుకొనెల మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌లను మించిన ఈగో క్లాషెష్‌ తలెత్తాయని, అందుకు దీపికా పదుకొనె ఈ ‘స్పిరిట్‌’ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇటీవల ‘స్పిరిట్‌’ సినిమాలోకి త్రిప్తీ దిమ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు సందీప్‌రెడ్డివంగా. గతంలో రణ్‌బీర్‌కపూర్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్‌’ మూవీలో త్రిప్తి ఓ కీలక పాత్ర పోషించారు.

ప్రభాస్‌ స్పిరిట్‌ సినిమా నుంచి దీపికా పదుకొనె అవుట్‌?

తాజాగా ‘ఎక్స్‌’ వేదికగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ( Director SandeepReddyVanga)  చేసిన ట్వీట్‌ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపు తోంది. ‘‘ఓ యాక్టర్‌కు నేను స్పిరిట్‌ కథను చెబితే, ఈ కథను పీఆర్‌ గేమ్స్‌లో భాగంగా లీక్‌ చేశా రని, ఈ సినిమా కోసం తాను కొన్ని సంవత్సరాలు కష్టపడ్డానని, ఓ యువ నటిని ఇబ్బంది పెడుతున్నారని, ఫెమినిజమ్‌ అంటే ఇదేనా? అని’ కాస్త ఘాటుగానే దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ట్వీట్‌ చేశాడు.

 

అయితే సందీప్‌రెడ్డి వంగా పోస్ట్‌ చేసింది దీపికా పదుకొనె (Heroine DeepikaPadukone)ను ఉద్దేశించే అని, అందుకే ట్వీట్‌లో హిందీ భాషను కూడా చేర్చారనే టాక్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రచారం లోకి వచ్చింది. మరి..ఈ విషయంపై దీపిక కూడా పరోక్షంగా ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

ప్రభాస్‌ స్పిరిట్‌లో యూనిమల్‌ బ్యూటీ

మరోవైపు ‘స్పిరిట్‌’ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబరులో మొదలవుతుందని, ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్‌ల మోతాదు సందీప్‌రెడ్డి వంగా గత చిత్రాల కంటే కాస్త ఎక్కువగానే ఉంటుందన్నట్లుగా ఓ హిందీ వెబ్‌సైట్‌ ఆర్టికల్‌ రాసింది. ఈ కథనాన్ని ఉద్దేశించే..సందీప్‌రెడ్డి వంగా ‘ఎక్స్‌’లో కాస్త అసహనం, ఆగ్రహాంగా రెస్పాండ్‌ అయ్యారని తెలుస్తోంది.

 

 

 

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *