Viajydevarakonda Ranabaali Update: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా (Ranabaali ) చిత్రీకరణ పూర్తయింది. ‘టాక్సీ వాలా’ (2018) వంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ఇది. దాదాపు 130 రోజుల పాటు, ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. 19 శతాబ్ధం నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పరిపాలన కాలంలో, రాయలసీమలో జరిగిన కొన్ని చారిత్రాత్మక వాస్తవ సంఘ టన ఆధారంగా, ఈ ‘రణబాలి’ సినిమా రూపుదిద్దుకుంది. టీ సిరీస్ ఫిలింస్, గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్‌ల సమర్పణలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 16న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అలాగే ‘రణబాలి’ చిత్రంలోని ‘ఏందయ్య సామి’ (Ranabaali First Single ‘Endhayya Saami’) పాటను సెప్టెంబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ ‘రణబాలి’ సినిమా రిలీజ్ కానుంది.

ఈ చిత్రంలో రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ, జయమ్మ పాత్రలో రష్మికామందన్నా, సర్ థియోడార్ హెక్టార్ పాత్రలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ నటించారు. ఈ చిత్రంలో భార్యభర్తలుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఇంకా ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత విజయ్–రష్మికల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ ‘రణబాలి’ సినిమాపై ప్రేక్షకుల్లో
అంచనాలు ఉన్నాయి. మరోౖవైపు రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్ 2’ సినిమా అక్టోబరు 16న అంటే… ‘రణబాలి’ సినిమా రిలీజ్‌కు ఒక్కరోజు ముందే రిలీజ్ అవుతుంది. దీంతో ఈ రెండు భారీ సినిమాల మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఉండేలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి..ఏ సినిమా లీడ్ తీసుకుంటుందో చూడాలి.