ఓటీటీలో ‘ఒక చిన్న ఫ్యామిలీస్టోరీ’ సిరీస్‌తో ఆకట్టుకున్నాడు సంగీత్శోభన్. ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలతో తనదైన యాక్టింగ్ ఆడియన్స్‌ను మెప్పించాడు సంగీత్ శోభన్. అయితే సంగీత్ శోభన్ తొలిసారిగా సోలో హీరోగా నటించిన సినిమా ‘రాకాస’ (Raakaasa Review). ఒక చిన్న ఫ్యామిలీస్టోరీకి రైటర్‌గా, బెంచ్లైఫ్ సిరీస్‌కు దర్శకురాలుగా పనిచేసిన, మహిళా దర్శకురాలు..మానస శర్మ ఈసినిమాను తెరకెక్కించారు. నిహారిక కొణిదెల నిర్మాత.
రాకాస సినిమా నేడు రిలీజైంది. మరి..రాకాస సినిమా మెప్పించిందా…
సినిమా: రాకాస (Raakaasa Review)
ప్రధాన తారాగణం: సంగీత్శోభన్, నయన్సారిక, గెటప్ శీను, బ్రహ్మాజీ, తనికెళ్లభరణి, ఆశిష్ విద్యార్థి, వెన్నెల కిషోర్
నిర్మాత:నిహారిక కొణిదెల, ఉమేష్‌కుమార్ భన్సాల్
దర్శకురాలు మానసా శర్మ
సంగీతం: అనుదీప్ దేవ్
ఎడిటింగ్: అన్వర్ అలి
కెమెరా: రాజు ఎదురోలు
విడుదల తేదీ ఏప్రిల్ 3, 2026
రేటింగ్ 2.75/5
Raakaasa Review Story:కథ
రాకవరం గ్రామంలోని కోటలో ఓ బ్రహ్మారాక్షసుడు ఉంటాడు. ఈ రాక్షసుడు సంకేతాలతో హెచ్చరించిన ప్రతిసారి, ఆ ఊరి ప్రజలు ఓ వ్యక్తిని, ఆ రాక్షకుడికి ఆహారంగా నరబలి ఇవ్వాలి. ఒకవేళ ఊరి జనం ఇలాచేయకపోతే, ఆ బ్రహ్మారాక్షసుడు ఈ ఊరిని నాశనం చేస్తాడు (Raakaasa 2026 review).
మరోవైపు…తనచిన్ననాటి ప్రేయసి కోసం వీరబాబు అమెరికా నుంచి తన సొంత ఊరు అయిన రాకవరం వస్తాడు. తన చిన్ననాటి ప్రేయసికి పెళ్లి అయ్యిందని తెలిసుకుని బాధపడుతుంటాడు. ఈ క్రమంలో సుబ్బ లక్ష్మి (నయన్సారిక), వీరబాబును ఇష్టపడుతుంది. ఇదే సమయంలో సోము (వెన్నెల కిషోర్) హత్యకు గురి అవుతాడు. ఈ కేసులో వీరబాబు చిక్కుకుంటాడు. బ్రహ్మారాక్షసుడుకి బలిగా తానే వెళ్లాల్సి రావాల్సిన పరిస్థితులను కొని తెచ్చికుంటాడు వీరబాబు. మరి..వీరబాబు కోటలోకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది? అసలు..ఆ బ్రహ్మారాక్షసుడు ఎవరు? వీరబాబు–సుబ్బుల ప్రేమకథ ఏమౌతుంది? అన్నది మిగిలిన కథాంశం (Raakaasa first day review).
సముద్రఖని ‘కార్మేని సెల్వం’ సినిమా రివ్యూ
Raakaasa horror comedy: విశ్లేషణ
హారర్ కామెడీ మిక్సైన జానర్ అంటే తెలుగు ఆడియన్స్‌కు ఎప్పుడూ ఇష్టమే. ఈ జానర్ సినిమాలొచ్చిన ప్రతిసారి ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. రాకాస సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. పెద్దగా భారీ హారర్ ఎలిమెంట్స్ ఏవీ లేకపోయినా…హారర్‌కి తోడు చందమామ కథలాంటి ఫ్యాంటసీని జోడించి, మంచి స్టోరీ చెప్పారు దర్శకురాలు మానసా శర్మ. నరబలి, బ్రహ్మారాక్షసుడు…వంటి కాన్సెప్ట్‌కు మంచి కథను అల్లుకుని, నవ్వించారు. పెద్దగా లాజిక్‌లు, గట్రా ఏమీ లేవు. జస్ట్ ఫన్ మ్యాజిక్‌ని ఫీల్ కావడమే. కథలోకి వెళ్లడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఇంట్రవెల్ ట్విస్ట్ ఫర్వాలేదు. తొలిభాగం గెటప్ శీను, రెండోభాగం వెన్నెల కిషోర్‌లు…కామెడీఈ సినిమాకు మేజర్ హైలెట్ అని చెప్పవచ్చు. ఆర్గానిక్ ఫ్లో కామెడీ వర్కైట్ అయ్యింది. డైలాగ్స్ కథకు తగ్గట్లుగా సరిపోయాయి. ప్రిడిక్టబిలిటీ సీన్స్ ఉన్నా..కామెడీ ఈ లోటును కప్పేసింది. బ్రహ్మారాక్షసుడి సెంటిమెంట్ స్టోరీ సో సో..గా ఉంది. ఓ…సినిమాను పెద్ద పోస్ట్‌మార్టం చేయకుండ…కామెడీని ఎంజాయ్ చేసే, ఆడియన్స్‌ను రాకాస సంతృప్తి పరుస్తుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్
వీరబాబుగా సంగీత్ శోభన్ (Raakaasa Hero Sangeeth Sobhan) చక్కగా నటించాడు. హీరోయిజం తాలుకూ బిల్డప్‌లు గట్రా..జోలికి వెళ్లకుండ యాక్టర్‌గా సక్సెస్ అయ్యాడు. సంగీత్ కెరీర్‌కు ఈ సినిమా సక్సెస్ మంచి హెల్ప్ అవుతుంది. నేచురల్ యాక్టింగ్ చేసినట్లుగా కనిపిస్తుంది. నయన్సారిక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. వెన్నెల కిషోర్ కామెడీ, ఈ పాత్రతో వచ్చే కామెడీ టైమింగ్ సూపర్ అనే చెప్పాలి. గెటప్ శీను సైతం తాన పాత్ర ఉన్నంత మేరకు నవ్వించే బాధ్యతను తీసుకుని, ఇందులో సఫలం అయ్యాడు. హీరోయిన్ తండ్రిగా తనికెళ్లభరణి, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ…వారి వారి పాత్రల పరిధి మేరకు యాక్టింగ్ చేశారు (Raakaasa Movie cast and crew)
శర్వానంద్ ‘బైకర్’ సినిమా రివ్యూ
తొలిసారి ఫీచర్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేసిన మానసా శర్మ (Raakaasa Director ManasaSharma) ఆడియన్స్‌ను నవ్వించడంలో హిటై్టయ్యారు. హారర్ కామెడీ జానర్లో సరికొత్తగా కాకపోయినా.. చక్కగా తీశారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్, ఆర్ఆర్ సౌండ్ చేశాయి. నిహారిక నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా, ఎడిటింగ్ అంశాలు ఫర్వాలేదు.
ఫైనల్‌గా: లాజిక్ల గురించి ఆలోచించకుండ చూస్తే…రాకాస సినిమా నవ్విస్తుంది. నిడివి కూడా తక్కువే కావడం మరో ఫ్లస్ పాయింట్. హాస్య ప్రియులకు రాకాస ఓ మంచి ఛాయిస్.