క్రాస్‌ఓవర్‌ అథ్లెట్‌ పెద్ది పోరాటం..ఊరి కోసం

Viswa
1 Min Read

Web Stories

Peddi trailer: రామ్‌చరణ్‌ (Ramcharan)  ‘పెద్ది’ సినిమా ట్రైలర్‌ (Peddi trailer) రిలీజైంది. ఈ రూరల్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో రామ్‌చరణ్‌ క్యారెక్టర్‌ తాలుకూ సస్పెన్స్‌ వీడింది. ‘పెద్ది’ సినిమాలో క్రాస్‌ ఓవర్‌ అథ్లెటిక్‌గా రామ్‌చరణ్‌ నటించారు. అంటే..ఒకడే…రెండుమూడు ఆటలు ఆడటం అన్నమాట. ఈ ‘పెద్ది’ మూవీలో రామ్‌ చరణ్‌ క్రికెటర్‌గా,కుస్తీ క్రీడాకారుడిగా, రన్నర్‌గా కనిపించనున్నట్లు విడుదలైన ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. ఇంకా ట్రైలర్‌ ప్రకారం, ఈ సినిమాలో రామ్‌చరణ్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్స్‌ షేడ్స్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ‘పెద్ది’ సినిమా కేవలం స్పోర్ట్స్‌ డ్రామా మాత్రమే కాదు. ఓ ఊరు సమస్యకు ఎలా పరిష్కారం దొరికిందనే అంశం, ఈ ‘పెద్ది’ సినిమాలో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

1970–1980 కాలమానంలో విజయనగరం నేపథ్యంతో సాగే రూలర్‌ డ్రామా ఇది. ఈ సినిమాలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్వేందు శర్మ, బొమన్‌ ఇరానీ, టీనూ ఆనంద్‌ ఇతర ప్రధాన పాత్రల్లో (Peddi Movie cast and crew) నటించారు. ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.‘పెద్ది’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ముంబైలో జరిగింది. ‘పెద్ది’లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని, నా కెరీర్‌లోని ‘మగధీర, ఆర్‌ఆర్‌ఆర్, రంగస్థలం’ సినిమాల మాదిరి, ఈ ‘పెద్ది’ సినిమా కూడ హిట్‌ అవుతుందని రామ్‌చరణ్‌ చెప్పారు.

ఇక ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌ సీక్వెన్స్‌, పోలీస్‌ స్టేషన్‌ ఫైట్‌ సీక్వెన్స్‌, నేషనల్‌ లెవల్‌ కుస్తీ పోటీ సెమిఫైనల్‌ మ్యాచ్‌, ప్రీ క్లైమాక్స్‌ ఫైట్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా (Peddi movie director) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మైత్రీమూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై వెంకట సతీస్‌ కిలారు నిర్మించిన ‘పెద్ది’ సినిమా జూన్‌ 4న (Peddi movie Release date) విడుదల కానుంది.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi