The Red Bag Movie: ‘ది రెడ్ బ్యాగ్’ సినిమాలో భాగమైయ్యారు సీనియర్ నటి రాశి. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించగా, హరికృష్ణ సోమిశెట్టి నిర్మించారు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇప్పటికే సినిమాను నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి ఆదరణ లభించింది.
క్రాస్‌ఓవర్ అథ్లెట్ పెద్ది పోరాటం..ఊరి కోసం
ఇప్పుడు ‘ది రెడ్ బ్యాగ్’ సినిమాలో, ఈ చిత్రం కథను మలుపు తిప్పే కీలక పాత్రలో రాశీ (Actress Raasi) నటించారు. ఈ పాత్ర పేరు సావిత్రి. సోమవారం సావిత్రి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ బ్యాగ్ చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నామని, త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం శేఖర్ మోపురి.