సిగ్మా..కొత్త విడుదల తేదీ ఎప్పుడుంటే…!

Kumar NA
1 Min Read

Web Stories

Sigma new release date: సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) హీరోగా నటించిన కొత్త సినిమా ‘సిగ్మా’ విడుదల తేదీ (Sigma new release date) ఖరారైంది. తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్‌ తనయుడు జాసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ అడ్వెంచరస్‌ సినిమా ఇది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 2న (Sigma release date) విడుదల కానుం ది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రాజు సుందరం, సంపత్‌రాజ్, శివ పండిట్, అన్భుథాసన్, యోగ్‌ జపే ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

అద్భుతంగా ఆశ్చర్యపరిచే ఆస్మాన్‌

ఇక ఒక నిధి అన్వేషణ నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఇకపోతే ‘సిగ్మా’ సినిమాను తొలుత ఈ ఏడాది జూలై 31నే రిలీజ్‌ చేయాలనుకున్నారు. తాజాగా అక్టోబరు 2న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ఇదే తేదీన వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శకుటుంబం ఏకే47’ సినిమా రిలీజ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu