Missamma Title Song: హర్ష నర్రా, తన్మయి ఖుషి, సిజు ఏఆర్, ప్రమోదిని, హారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మోడ్రన్ మిస్సమ్మ’ (Modern Missamma Movie). సాయిబాబా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో పాటుగా, ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. బుధవారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘బెటర్ బీ ఏ మిస్స మ్మ’ పాటను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో విడుదల చేశారు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరపరచిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. పెళ్లి వద్దని చెబుతున్నట్లు హీరోయిన్ పాడుకునే పాట ఇది.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన ‘వదల’ చిత్ర నిర్మాత కిశోర్ నాయుడు మాట్లాడుతూ –‘‘ఇటీవల ఈ సినిమా ప్రీమియర్ చూశాను. ఈ సినిమాలో నాకేవీ లోపాలు కనిపించలేదు. కచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఇందులోని భద్రం పాత్ర చాలా హిలేరి యస్‌గా ఉంటుంది’ అని అన్నారు.
హీరో హర్ష నర్రా మాట్లాడుతూ– ‘‘మిస్సింగ్’, ‘రోటి కపడా రొమాన్స్’ తర్వాత ఇది నా మూడో సినిమా. ఈ రెండు చిత్రాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. అయినా నా పోరాటం ఆగదు. కష్టపడుతూనే ఉంటాను. ఈ సినిమా కష్టపడి కాకుండా ఇష్టపడి చేశాం. టీమ్ అంతా ఫ్రెండ్స్‌లా మూవీ చేశాం. తన్మయి చాలా బాగా నటించింది. ఈ పాట విషయంలో గోపీ సుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. కిట్టు విస్సా ప్రగడ గారు రాసిన లిరిక్స్ అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటాయి. అలాగే సినిమా కూడా అందరికీ రిలేట్ అవుతుంది’’ అని చెప్పారు.
హీరోయిన్ తన్మయి ఖుషి మాట్లాడుతూ– ‘‘23’ మూవీ తర్వాత నటించిన సినిమా ఇది. నాగార్జున గారి ‘మన్మధుడు’ చిత్రంలోని ‘వద్దురా సోదరా’ అనే సాంగ్ అప్పట్లో మగవాళ్లకు కనెక్ట్ అయినట్టు, ఇప్పుడు మా చిత్రంలోని ఈ సాంగ్ అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. దర్శకుడు అమ్మాయిల పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఈ కథను రాయడం చాలా సంతోషంగా ఉంది. నా క్యారెక్టర్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది’’ అని చెప్పారు.
డైరెక్టర్ సాయి బాబా మాట్లాడుతూ– ‘‘ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఇళ్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు చెబుతుంటారు కదా.. దానికి నేనొక ఒకటి యాడ్ చేద్దామనుకుం టున్నా. సినిమా చేసి చూడు అని. ఈ మూడింటిలో అదే కష్టం ఉంటుంది అని నమ్ముతున్నా. నేను రాసిన దానికంటే మా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్‌తో మోడ్రన్ మిస్సమ్మ అనే టైటిల్ పెట్టొచ్చు అని నిరూపించారు. గోపీ సుందర్ గారి మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. ఈ సినిమా ద్వారా పెళ్లి వద్దు అని చెప్పడం లేదు.. పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసు కోవాలంటే మా సినిమా చూడాల్సిందే’’ అని చెప్పారు.
నిర్మాత చిరంజీవి పమిడి మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్‌లో ‘కాలింగ్ సహస్ర’ తర్వాత రాబోతున్న రెండో సినిమా ఇది. మా తొలి సినిమాకు సరైన ఫలితం రాలేదు. ఈ చిత్రానికి మాత్రం మంచి ఆదరణ దక్కు తుందని నమ్ముతున్నాను. మా హీరో హర్ష చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. హీరోయిన్ కూడా అంతే బాగా నటించారు. రెండేళ్ల క్రితం ఈ జర్నీ స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా మూవీ తీయాలనుకున్నాం. మంచి అవుట్‌పుట్ వచ్చింది. అనుకున్న టైమ్‌లో అనుకున్న బడ్జెట్‌తో సినిమా పూర్తి చేశాం. అదే మా మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాం. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’అని అన్నారు.
‘‘ఈ సినిమా తన లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ ఛాప్టర్ అని, టీమ్ అందరి హార్డ్‌వర్క్‌తో మంచి అవుట్‌పుట్ వచ్చిందని’ అన్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, కొరియోగ్రాఫర్ బాలకృష్ణ తెలిపారు.
ఈ చిత్రానికి శేషు రాజ్ దడ్డాల, విజయ్ పిడపా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆదిత్య పాపిశెట్టి ఎడిటర్‌గా, బాలకృష్ణ కొరియోగ్రఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి ఉప్పుతొల్ల బాబు (బాబీ) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
