ఆలస్యంగా రానున్న ఆదర్శకుటుంబం

SPM
SPM
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
1 Min Read
Venkatesh AK47 Movie Release date changed

Web Stories

AadarshaKutumbam Release date: వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా నటిస్తున్న ఆదర్శకుటుంబం (AadarshaKutumbam Movie) సినిమా విడుదల వాయిదా పడింది. వెంకటేశ్‌ సూపర్‌హిట్‌ సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’లకు కథా, డైలాగ్‌ రైటర్‌గా పనిచేసిన దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ ‘ఆదర్శకుటుంబం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ఆదర్శకుటుంబం’ సినిమాను తొలుత అక్టోబరు 2న రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌. కానీ వారం ఆలస్యంగా, అంటే…తాజాగా అక్టోబరు 9న (AadarshaKutumbam Movie Release date) రిలీజ్‌ చేయ నున్నట్లు మేకర్స్‌ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

ది ప్యారడైజ్‌ మూవీ ఫస్ట్ రివ్యూ…సవారీల తిరుగుబాటు

వెంకటేశ్, శ్రీనిధిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నారా రోహిత్, నివేతాపేతురాజ్, యువినా, రాజ్‌ ప్రజ్వల్, రావు రమేష్, సత్య ఇతర ప్రధాన పాత్రల్లో (AadarshaKutumbam Movie cast and crew) నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ .ఎస్‌ సంగీత దర్శకుడు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఆదర్శకుటుంబం’ సినిమా రూపుదిద్దుకుం టున్నప్పటికీని, ఇందులో కొంత క్రైమ్‌ కామెడీ కూడా ఉండబోతుందని తెలిసింది. అలాగే సెకండాఫ్‌లో వయొలెన్స్‌ సన్నివేశాలు కూడా బలంగా ఉంటాయని తెలిసింది. ఇక ‘ఏకే 47’ సినిమా కాకుండా, అనిల్‌ రావిపూడి దర్శ కత్వంలో వెంకటేశ్‌ హీరోగా ‘జవనరి 12 విడుదల’ అనే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌ మరో హీరోగా నటిస్తున్నారు.

Please Share
Share This Article
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu