ఆర్యన్ గౌర (Aryan Gowra) హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వ రచనతో రూపొందుతున్న ఎమోషనల్ లవ్‌స్టోరీ సినిమా ‘జాన్’. ఈ చిత్రంలో మోనిషా మోహన్ (Monisha Mohan) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రేమ, అనుబంధం, తోడు…అంశాల నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో రావు రమేష్, బాబా భాస్కర్, ‘శుభలేఖ’ సుధాకర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమాను లక్ష్మీ నరసింహా మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించబడుతోంది. ‘‘ప్రేమ, అనుబంధం, జీవిత ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా నిలిచే భావోద్వే గాలను ఈ సినిమా ఆవిష్కరిస్తుంది’’ అని అని చిత్రంయూనిట్ పేర్కొంది. సూర్య ‘సూరారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’), ధనుస్ ‘వాతి’ (తెలుగులో ‘సార్), శివకార్తికేయన్ – సాయి పల్లవిల ‘అమరన్’ చిత్రాలకు సంగీతం అందించి, మూడుసార్లు జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్న జీవీ ప్రకాష్‌కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.