Comrade Kalyan Trailer: హీరోగా శ్రీవిష్ణు (SreeVishnu) మరో ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. 1992 ఆంధ్ర–ఓరిస్సా బ్యాక్‌డ్రాప్‌తో శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan Movie) సినిమా ట్రైలర్ విడు దలైంది. ఈ సినిమా ఈ నెల9న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. లేటెస్ట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ (Comrade Kalyan Trailer) చేశారు మేకర్స్. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికాశరత్‌కుమార్, షైన్‌టామ్ చాకో, ఉపేంద్రలిమాయే ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ సినిమాకు నిర్మాతలు. ఈ సినిమా ఈ అక్టోబరు 9న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
ముత్తువేల్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా?
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టైటిల్ కామ్రేడ్ కల్యాణ్ అంటూ కాస్త పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీని, కంటెంట్ పరంగా సినిమాలో ఫన్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓరిస్సా నుంచి వచ్చిన మహిమా నంబియార్‌ను శ్రీవిష్ణు ప్రేమించడం, ఈ ఇద్దరి ప్రేమకు భాష ప్రాబ్లమ్ కావడం ట్రైలర్‌లో కనిపిస్తుంది. కేరళ పోలీస్‌గా షైన్‌టామ్‌చాకో నటించగా, బాలకృష్ణ విరాభిమానిగా రాధికాశరత్
కుమార్ నటించారు. కామెడీ హైలైట్ చేస్తూ, అండర్ కరెంట్‌గా ఓ సందేశాన్ని ఇచ్చేందుకు ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీమ్ కొత్తగా ఏదో ట్రై చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.