Aadarsha Kutumbam House No: 47 Review: వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఆడియన్స్‌లో అంచనాలు ఉండటం సహజం. వెంకటేశ్ హీరోగా, త్రివిక్రమ్ డైలాగ్స్–కథ అందించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడమే ఇందుకు కారణం. ఇలా వీరిద్దరికీ రెండు బలమైన సూపర్‌హిట్ సినిమాలు ఉన్నా, త్రివిక్రమ్–వెంకటేష్ కాంబినేషన్‌లో మరో మూవీ రావడానికి రెండు దశాబ్దాల కాలం పట్టింది. వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘ఆదర్శకుటుంబం హౌస్ నెం 47:ఏకే 47’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి…ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలో (Aadarsha Kutumbam House No: 47 Review) చదివేద్దాం.
నటీనటులు: వెంకటేశ్, శ్రీనిధిశెట్టి, రాజా ప్రజ్వల్, యువినా, నారా రోహిత్, నివేతాపేతురాజ్, ఉదయార్ సంధు
దర్శకత్వం: త్రివిక్రమ్
నిర్మాత:సూర్యదేవర రాధాకృష్ణ (ఎస్ చినబాబు)
సంగీత దర్శకుడు:తమన్
కెమెరా: రవిచంద్రన్
నిడివి 2 గంటల 29 నిమిషాలు
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేదీ: 30–10–2026
రేటింగ్:2.5/5
కథ
చిట్టిబాబుది (వెంకటేష్) ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. అతని భార్య స్వర్ణ (శ్రీనిధిశెట్టి) చీటి పాటలో అప్పలు చేస్తుంది. కొడుకు శర్వా (రాజా ప్రజ్వల్) గుండె జబ్బు. కుమార్తె సంపూర్ణ (యువినా) ఓ మెకానిక్‌ను ప్రేమిస్తుంది. చిట్టిబాబుకు ఉన్న ఈ సమస్యలు చాలవన్నట్లు అతని ఉద్యోగం కూడా పో తుంది. కానీ సడన్‌గా చిట్టిబాబుకు రూ. 100 కోట్ల లాటరీ తగుల్తుంది. దీంతో ఓ రిచ్‌హౌస్‌కు షిఫ్ట్ అవుతారు. మరోవైపు దొంగ తనాలు–హత్యలు చేసే ఓ అంతరాష్ట్ర ముఠా చిట్టిబాబు ఫ్యామిలీపై ఫోకస్ పెడుతుంది. మరి..ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ముఠా నుంచి చిట్టిబాబు తన ఫ్యామిలీని ఎలా కాపాడు కున్నాడు? పోలీస్ ఆఫీసర్ దామోదర్ (నారా రోహిత్)కు చిట్టిబాబుపై వచ్చిన అనుమానం ఏమిటి? మరో పోలీస్ ఆఫీసర్ బృహస్పతి(రావు రమేష్)కు చిట్టిబాబుకు ఉన్న సంబంధం ఏమిటి? జస్టిస్ ప్రదీప్ సర్కార్ (నాజర్) మరణం చిట్టిబాబు జీవితంపై ఏ విధమైన ప్రభావం చూపించింది? అన్నది మిగతా కథ (Aadarsha Kutumbam Cinema Review).
విశ్లేషణ
ఓ తండ్రి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే ‘ఆదర్శకుటుంబం’ సినిమా మెయిన్ పాయింట్. ఈ అంశంలో వచ్చిన సినిమాలు బోలెడు. ‘ఆదర్శకుటుంబం’ సినిమాలోనూ కొత్తగా ఏమీ లేదు. కాకపోతే… కథనాన్ని చూపించిన విధానం ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసేలా ఉంది. ఇంట్రవెల్ బ్యాంగ్ కుదిరింది. వెంక టేష్, సత్యల కామెడీ, త్రివిక్రమ్ పెన్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధానబలంగా నిలిచాయి. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ సీన్, సెకండాఫ్‌లో కొంత సాగదీత, ఆకట్టుకోని తమన్ ఆర్‌ఆర్ ఈ సినిమాకు ప్రధా నమైన మైనస్‌లుగా చెప్పుకోవచ్చు. కొన్ని లాజిక్ లెస్ సీన్స్ కూడా ఉన్నాయి. సత్య క్యారెక్టర్ సడన్‌గా మా యం కావడం, థియేటర్స్‌లో ‘మాలా వచ్చా చూడు..’ పాట లేకపోవడం…ఈ సినిమాను మరింత మైనస్ చేసే అంశాలు. వీటికి తోడు తమిళ సినిమాలు కార్తీ ‘ఖాకీ’, అర్జున్‌దాస్ ‘కాన్ సీటీ’, అర్జున్ ‘బ్లాస్ట్’, హిందీ సినిమా ‘కిల్’ వంటి సినిమాల్లోని సీన్స్ పార్టులు, పార్టులుగా సిల్వర్‌స్క్రీన్‌పై కనిపిస్తాయి.

తొలి భాగంలో దొంగలు చిట్టిబాబు ఇంట్లోకి ప్రవేశించేప్పుడు సీసీ కెమెరాలను నాశనం చేస్తారు. సెక్యూరిటీ గార్డులను మత్తులో ఉంచుతారు. కానీ మరోసారి చిట్టిబాబు నివాసం ఉంటున్న గెటెడ్ కమ్యూనిటీ అంతా క్లబ్‌హౌస్‌లో ఉన్నప్పుడు కూడా దొంగలు దర్జాగా చిట్టిబాబు ఇంట్లో మాటు వేయడం ఏంటో అర్థం కాదు. వందకోట్ల లాటరీ కాన్సెప్ట్ కూడా అంత కన్విన్సింగ్‌గా లేదు. క్లైమాక్స్ ఒకే. ఎక్కడో సంక్రాంతికి వస్తున్నాం సినిమా లోని క్లైమాక్స్ ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి.
నటీనటుల పెర్ఫార్మెన్స్
చిట్టిబాబు పాత్రలో వెంకటేశ్ తనదైన మార్క్ యాక్టింగ్ చూపించాడు. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌లో తన అనుభవాన్ని చూపించాడు. తన కామెడీ టైమింగ్‌లో ఏ మాత్రం పదునుతగ్గలేదని చూపించారు. ఈ ‘ప్రతి ఎక్స్‌ప్రెషన్ కనిపించడానికి నేను ఏమైనా మోహన్‌లాల్‌నా? కమల్‌హాసన్‌నా?’ అంటూ వెంకటేశ్ డైలాగ్ చెప్పారంటే… ఈ సినిమా కోసం ఆయన ఎంత బ్లెండ్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఇక స్వర్ణ పాత్రలో శ్రీనిధిశెట్టి కొత్తగా కనిపించారు. తనలో యాక్షన్, కామెడీ యాక్టింగ్ యాంగిల్ కూడా ఉందని ఈ సినిమాతో చెప్పారు. యువచైల్డ్ ఆర్టిస్టులు యువినా, రాజా ప్రజ్వల్..తమను ఆడియన్స్ గుర్తుపెట్టుకునే పాత్రలు చేశారు. ముఖ్యంగా రాజా ప్రజ్వల్ మ్యాజిక్ బాగుంది. విలన్ చందన్‌గా ఉదయ్‌బీర్ సంధు యాక్టింగ్ ఒకే. ఎస్‌ఐ దామోదర్‌గా నారా రోహిత్ పాత్ర రెగ్యులర్‌గా ఉంది. మాలతిగా నివేతాపేతురాజ్ రోల్ ఈ సినిమాకు ఎక్స్‌ట్రా. కథకు ఉపయోగమైన పాత్ర కాదు ఇది. పోలీస్ ఆఫీసర్లుగా రావురమేష్, బ్రహ్మజీ, లేడీ విలన్‌గా దేవియానిశర్మ, షఫీ, నాజర్, సచిన్ ఖేడ్కర్…ఇలా వారు వాళ్ల పాత్రల పరిధిమేర నటించారు.
వెండితెరపై రక్తం కనిపిస్తేనే ఆడియన్స్ శాటిస్‌ఫై అవుతారని అనుకుంటున్న ఈ తరం ఫిల్మ్‌మేకర్స్ జాబితా లో త్రివిక్రమ్ సైతం చేరిపోయారు. వెంకటేశ్‌తో వెండితెరపై తల నరికించారు. త్రివిక్రమ్‌లోని పెన్ పవర్ ఇంకా బలంగానే ఉంది. ‘సచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఎక్కడ ఉంది సార్’, ‘నేనొక ప్రింట్ అవ్వని పుస్తకాన్ని..చదవడానికి ప్రింట్ కాలేదు. చదివితే అర్థం కాదు’ అంటూ రావు రమేష్ చేత త్రివిక్రమ్ చెప్పిన డైలాగ్స్‌నే ఇందుకు నిదర్శనం. కానీ ఈ సినిమా వరకు త్రివిక్రమ్ దర్శకుడిగా కమర్షియల్ అంశాలపైనే ఎక్కువ దృష్టిపెట్టారని తెలుస్తోంది. వెంకటేశ్ పక్కన ఉన్న రఘుబాబు క్యారెక్టర్‌ను చూస్తుంటే…‘ఎఫ్ 2’ సినిమాలో ఉన్న వెంకటేష్–రఘుబాబు ట్రాక్‌నే గుర్తుకు వస్తుంది. త్రివిక్రమ్ స్టైల్‌లో ఇది డెస్టినీ ఏమో.
ఇక తమన్ మ్యాజిక్ ఈ సినిమాకు ఏమాత్రం అదనపు బలం కాలేక పోయింది. ఎడిటింగ్ ఒకే. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్‌గా, ఉన్నతంగా ఉన్నాయి.
చివరిగా..: ఫ్యామిలీ ఆడియన్స్ ఓ సారి ‘ఆదర్శకుటుంబం’ను చూడొచ్చు. కానీ పూర్తిగా సంతృప్తి చెంతుతారని మాత్రం చెప్పలేం. అలా అని నిరాశపడరు కూడా. జస్ట్ వన్ టైమ్ వాచబుల్‌గా ఈ సినిమా ఉంటుంది.