అల్లు అర్జున్‌ గ్యాంగ్‌స్టార్‌

Kumar NA
1 Min Read

Web Stories

హీరో అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజన్‌ కాంబినేషన్‌లోని సినిమాపై ఇండస్ట్రీలోని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా చిత్రీకరణను తొలుత ఈ ఏడాదే జరపాలని ప్లాన్‌ చేశారు. ఈ ప్లాన్‌కు తగ్గట్లుగానే, ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాదే ప్రారంభిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్‌ వీడియోలో ప్రకటించారు.

స్క్రిప్ట్‌ విషయంలో అల్లు అర్జున్‌ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయడానికి మరికొంత సమయం పట్టింది. మరోవైపు ‘రాకా’ సినిమా షూటింగ్‌తో కూడా అల్లు అర్జున్‌ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్‌ కనగరాజ్‌ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాదికి షిష్ట్‌ అయ్యిందని తెలిసింది. షూటింగ్‌ను అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభించినా, మొత్తం షూట్‌ను 2027లోపే పూర్తి చేయాలని అల్లు అర్జున్‌ టార్గెట్‌గా పెట్టుకున్నారట.

అలాగే ఈ సినిమాను గురించిన ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్‌ కెరీర్‌లోని ఈ 23వ సినిమా గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఓ యాక్షన్‌ డ్రామా అని, ఈ సినిమాకు ‘గ్యాంగ్‌ స్టార్‌’ (gang star movie) అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని తెలిసింది. అల్లు అర్జున్‌ను అయన అభిమానులు ఐకాన్‌స్టార్‌ అని పిలుచుకుంటుంటారు. ఇప్పుడు ఆయన తదుపరి సినిమాకు ‘గ్యాంగ్‌ స్టార్‌’ (AA23 title is gangstar) అనే పరిశీలనకు రావడం గమనార్హం. ఇక ‘రాకా’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah