సిద్దు జొన్నలగడ్డ, నయన్సారిక హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. తబిత సుకుమార్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ పతకాలపై అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బండ్రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బి.మోహన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
సిద్దు జొన్నలగడ్డ కెరీర్లోని ఈ పదో సినిమా ప్రారంభోత్సవంలో దర్శకుడు సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ మహూర్తపు తొలి తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. నిర్మాతలు విశ్వప్రసాద్, బాపినీడు, దర్శకులు బుచ్చిబాబు, చందూ మొండేటి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. దర్శకులు హరీశ్ శంకర్, నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంతో సినిమా ప్రయాణం శుభారంభమైంది. వచ్చే ఏడాది ప్రేమకథ చిత్రం రిలీజ్ కానుంది.









