కింగ్‌డమ్‌కు తొందరేముంది?

Vijaydevarakonda kingdom Release date: విజయ్‌దేవరకొండ కింగ్‌డమ్‌ మూవీ మే 30న రిలీజ్‌ అవుతుందా? లేదా? అనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది.

Viswa
2 Min Read
Vijaydevarakonda kingdom Release date78

టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌దేవరకొండ లేటెస్ట్‌ మూవీ ‘కింగ్‌డమ్‌ (kingdom)’. ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌తిన్ననూరి ఈ సినిమాకు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. కింగ్‌డమ్‌ (Vijaydevarakonda kingdom Release date) సినిమాను తొలుత మార్చి 28న రిలీజ్‌ ప్లాన్‌ చేశారు. కానీ వీలుపడలేదు. దీంతో..మార్చి 28న తన బ్యానర్‌ నుంచే ‘మ్యాడ్‌ 2’ సినిమాను దింపాడు నాగవంశీ. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఇప్పుడు ‘కింగ్‌డమ్‌ (Kingdom)’ సినిమాఫై ఫోకస్‌ పెట్టారు నాగవంశీ. ఇటీవల ‘కింగ్‌డమ్‌’ సినిమాను మే 30న రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. అయితే ఈ తేదీకి ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతుందా? లేదా? అనే డౌన్‌ ప్రస్తుతం రేజ్‌ అవుతోంది.

కింగ్‌డమ్‌ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాలేదు. ముఖ్యంగా మల్టీపుల్‌ ప్రాజెక్ట్స్‌తో ఈ చిత్రం సంగీత దర్శకుడు అనిరుద్‌ రవిచందర్‌ బిజీగా ఉండటం కూడా ఓ కారణమని అంటున్నారు (ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది). ‘కింగ్‌డమ్‌’ సినిమా నుంచి ఒక్కటీజర్‌ వచ్చింది. ఆసక్తికరంగానే ఉంది. కానీ…సాంగ్‌ రాలేదు. ఈ సాంగ్‌ను నెక్ట్స్‌ వీక్‌ రిలీజ్‌ చేస్తామని నాగవంశీ చెబుతున్నారు.

అంతా సరే కానీ…ఇంత హడావిడిగా ‘కింగ్‌డమ్‌’ సినిమాను మే 30నే ఎందుకు రిలీజ్‌ చేయాలని అను కుంటున్నారో అన్న చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది. విజయ్‌ దేవరకొండ (Vijaydevarakonda) కెరీర్‌కు ‘కింగ్‌డమ్‌’ మూవీ చాలా ఇంపార్టెంట్‌. ‘లైగర్‌’ వంటి డిజాస్టర్‌ తర్వాత విజయ్‌దేవరకొండ నుంచి వస్తున్న మాస్‌ ఫిల్మ్‌ ఇది(ఫ్యామిలీమేన్‌ పూర్తి మాస్‌ ఫిల్మ్‌ కాదు). ఈ హడావిడిలో ఏదైనా జరిగితే..లాస్‌ అయ్యేది విజయ్‌ దేవరకొండనే. అలాగే ఈ చిత్రం దర్శకుడు గౌతమ్‌తిన్ననూరికీ ఈ సినిమా, అతని కెరీర్‌లో చాలా క్రూషియల్‌. ఇలాంటి సమయంలో ‘కింగ్‌డమ్‌’ సినిమాకు అన్నీ పనులు సవ్యంగా పూర్తి చేసుకుని, హాయిగా ప్రమోషన్స్‌ చేసుకుని, జనాలు ‘కింగ్‌డమ్‌’ గురించి నాలుగు మాటలు మాట్లాడుకుంటున్న సమయంలో రిలీజ్‌ చేస్తే… విజయ్‌కు, అతని ఫ్యాన్స్‌కీ బాగుంటుంది (kingdom Release date).

దాదాపు మూడు సంవత్సరాల నుంచి ‘కింగ్‌డమ్‌’ షూటింగ్‌ జరుగుతోంది. ఇన్ని రోజులు ఎదురుచూసిన విజయ్‌ ఫ్యాన్స్‌ మరికొన్ని రోజులు రోజులు తప్పక ఎదురుచూస్తారు.పైగా లైగర్‌, ఫ్యామిలీమేన్‌ సినిమాల విషయంలో విజయ్‌ కొంత ట్రోలింగ్‌ని ఫేస్‌ చేయాల్సి వచ్చింది. మళ్లీ ఈ తరహా విషయాలు రిపీట్‌ కాకుండ..మేకింగ్‌, విజువల్స్‌ పరంగా సరైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకా ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. తొలిభాగం సక్సెస్‌ అయితేనే, రెండో భాగం వస్తుంది. సో..తొలిభాగం విషయంలో మేకర్స్‌ మరింత కేర్‌ తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉంది. మరి..కింగ్‌డమ్‌ భవితవ్యం ఏమౌతుందో చూడాలి.

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *