Nagarjuna 100thMovie: కింగ్‌ 100 నాటౌట్‌

Viswa
1 Min Read
Hero Nagarjuna 100th film King100 not out

Web Stories

నాగార్జున (Hero Nagarjuna) వందో సినిమా (Nagarjuna 100thMovie) గురించి ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో విభిన్నరకాలైన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఏ సినిమా ఫైనలైజ్‌ కాలేదు. తమిళ దర్శకులు మోహన్‌రాజా, నవీన్‌ల నుంచి చాలామంది తెలుగు దర్శకులు చెప్పిన కథలనూ నాగార్జున వింటూనే ఉన్నారు. కానీ ఏ కథలేవీ నాగార్జునను ఇంప్రెస్‌ చేయలేకపోయాయి.

కానీ తమిళ దర్శకుడు ఆర్‌ఏ.కార్తీక్‌ (Director Ra.Karthick) చెప్పిన ఓ కథ నాగార్జునకు బాగా నచ్చింది. యాక్షన్‌ ఈజ్‌ ఉన్న ఫిల్మ్‌ కథ అంట. దీంతో ఈ సినిమాకు నాగా ర్జున (Nagarjuna) ఆల్మోస్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమా చారం. లేటెస్ట్‌గా ఈ సినిమాకు ‘కింగ్‌100 నాటౌట్‌’ అనే టైటి ల్‌ను కూడా పరిశీ లిస్తున్నారట మేకర్స్‌. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లోనే ఈ సినిమాను నిర్మించాలని నాగార్జున భావిస్తు న్నారట. అయితే నాగార్జునకు కార్తీక్‌ మరో నరేషన్‌ఇవ్వాల్సి ఉందట. ఈ ఫైనల్‌ నరేషన్‌ కూడా నాగార్జునకు నచ్చితే, ఈ మూవీ ఆల్మోస్ట్‌ ఫిక్స్‌ అయినట్లే. ఈ ఏడాదే ఈ సినిమాను సెట్స్‌కు తీసుకుని వెళ్లాలనుకుంటున్నారు.

మరోవైపు రజనీకాంత్‌ హీరోగా, నాగార్జున లీడ్‌ రోల్‌లో యాక్ట్‌ చేసిన ‘కూలీ (Rajinikanth Coolie Release)’ సినిమా ఆగస్టు 14న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే..ధనుష్‌తో కలిసి నాగార్జున చేసిన ‘కుబేర’ (Kubera movie Release) మూవీ జూన్‌ 20న రిలీజ్‌ కానుంది.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi