Gaayapadda Simham Trailer: ‘గాయపడ్డ సింహం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. పంచ్‌లు, కామెడీ డైలాగ్స్‌తో మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్‌గా అనిపిస్తోంది. దరహాస్గా తరుణ్ భాస్కర్ యూఎస్ వెళ్లి సెటిల్ కావాలనుకోవడం, యూఎస్‌లో సెటిలైన వ్యక్తినే, ఫరియా అబ్దుల్లా వివాహం చేసుకోవాలనుకోవడం వంటి అంశాలను ఈ సినిమా ట్రైలర్లో చూపించారు.
అలాగే సత్య లాజిస్టిక్స్‌తో ఆయుధాల అక్రమరవణా చేసే ధర్మ పాత్రలో జేడీ చక్రవర్తి నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎక్స్టెండెడ్ క్యామియో రోల్లో శ్రీవిష్ణు నటించారు.
ట్రైలర్లో ఈ కింది డైలాగ్స్ ఉన్నాయి.
ఈ ప్రపంచంలో కొందరికీ ప్రేమ కావాలి…కొందరికి డబ్బు కావాలి…కొందరికీ ప్రపంచమే కావాలి
ట్రంప్ తీసుకోచ్చిన కొత్త పాలసీ…మన తెలుగు వారికి ఒక షాపంలా మారింది
సత్యలాజిస్టిక్స్లో కస్టమర్ ఈజ్ కింగ్…పాపమైన పుణ్యమైనా డెలివరీ చేస్తా…
ఒక్క దరహాస్ పోయిన పర్లేదు..వందమంది దరహాస్లు పుట్టుకోస్తారు…
ట్రంప్ మీద రివెంజ్ ఏంట్రా…బటయ తెలిస్తే మన పరువు పోయింది…ట్రంప్‌కు తెలిస్తే…మన దేశమే పోతుంది.
పవన్ సాధినేని సమర్పణలో కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ ఈ సినిమాను నిర్మించారు. మే1న (Gaayapadda Simham cinema release date) ఈ సినిమా రిలీజ్ కానుంది.
అమెరికాలో సెటిల్ అవ్వాలని కలలుకంటాడు దరహాస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీల కారణంగా డిపోర్ట్ అవుతాడు. అతని కలలు ఒక్కసారిగా ఛిన్నాభిన్నమవుతాయి. ప్రేమ, భవిష్యత్తు.. ఒక్కసారిగా దెబ్బతినడంతో, తనలో పెరిగే నిరాశ, కోపం అతడిని ఒక విచిత్రమైన రివెంజ్ వైపు నడిపిస్తుంది. ఈ భావోద్వేగ ప్రయాణాన్ని దర్శకుడు సెటైర్, డార్క్ హ్యూమర్‌తో మేళవించి ఈ సినిమాతో స్క్రీన్‌పైకి తీసుకువచ్చినట్లుగా ట్రైలర్ స్పష్టం చేస్తోంది.