please subscribe to Tollywoodhub YouTube channel

ఎన్టీఆర్‌…సిల్వర్‌స్క్రీన్‌పై ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా!

Viswa
1 Min Read
ntr in DadasahebPhalke biopic

Web Stories

ముఫ్ఫైకిపైగా సినిమాలను పూర్తి చేసిన ఎన్టీఆర్‌ ఇప్పటివరకు ఓ బయోపిక్‌లో యాక్ట్‌ చేయలేదు. అయితే ఎన్టీఆర్‌కు ఇప్పుడు ఆ అవకాశం తలుపు తట్టినట్లుగా తెలుస్తోంది. ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమాగా చెప్పకునే దాదా సాహేబ్‌ ఫాల్కేబయోపిక్‌ (Dadasaheb Phalke Biopic)లో ఎన్టీఆర్‌ (NTR) నటించనున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది.

2023 సెప్టెంబరులో రాజమౌళి సమర్పణలో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ (Makeinindia) అనే సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. రాజమౌళి (SSRajamouli) తనయుడు ఎస్‌ఎస్‌ కార్తీకేయ (Producer SSKarthikeya), వరుణ్‌ గుప్తా (Varunguptha)ఈ సినిమాకు నిర్మాతలు. నితిన్‌ కట్టర్‌ డైరెక్టర్‌. కరోనా సమయంలో కాబట్టి ఈ సినిమాపై అంతగా ఎవరూ ఫోకస్‌ పెట్ట లేదు. అయితే ఈ సినిమా దాదా సాహేబ్‌ ఫాల్కే బయోపిక్‌ అని,ఈ సినిమాలో నటించా ల్సిందిగా, ఎన్టీఆర్‌ను రాజమౌళి అండ్‌ కార్తీకేయ టీమ్‌ అప్రోచ్‌ అయ్యారనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఇటీవల స్క్రిప్ట్‌ విన్న ఎన్టీఆర్‌ ఈ మేడ్‌ ఇన్‌ ఇండియా సినిమాలో చేసేందుకు ప్రాథ మికంగా అంగీకారం తెలిపారట. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ మూవీ ప్రారంభం అవుతుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ నెక్ట్స్‌ దేవర2 (Devara2) సినిమా ఉంది. తమిళ దర్శకుడు నెల్సన్‌తోనూ ఎన్టీఆర్‌కు ఓ కమిట్‌మెంట్‌ ఉంది. ఒకవేళ అన్నీ కుదిరితే…ఎన్టీఆర్‌ నెల్సన్‌ మూవీ స్టార్ట్‌ కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి…‘దేవర 2’, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’  (make in india)సినిమా లను ఎన్టీఆర్‌ సెట్స్‌పైకి తీసుకుని వెళ్లొచ్చని ఊహింవచ్చు.

 

 

 

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi