ఆడదాని ప్రేమకేమున్నాయ్‌

Viswa
2 Min Read
Ananthika sanilkumar 8 Vasanthalu

Web Stories

‘మధురం’ వంటి షార్ట్‌ ఫిల్మ్, ‘మను’ వంటి మరో డిఫరెంట్‌ ఫిల్మ్‌ తీసిన ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్‌లో రూపొందిన తాజా ప్రేమకథ చిత్రం ‘8 వసంతాలు’. అనంతిక సనీల్‌కుమార్, హను రెడ్డి, దుగ్గిరాల రవితేజ
మెయిన్‌ లీడ్‌ రోల్స్‌ చేయగా, సంజన, కన్నా, స్వరాజ్‌ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ ‘8 వసంతాలు’ సినిమా ఈ జూన్‌ 20న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగానే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. లవ్, లవ్‌ బ్రేకప్, మదర్‌ సెంటిమెంట్, గతం, మనోవేధన…వంటి అంశాల మేళవింపుతో ‘8 వసంతాలు’ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఫణీంద్ర నర్సెట్టి డైలాగ్స్, రైటింగ్‌ కనిపిస్తోంది. మరీ..ముఖ్యంగా అనంతిక ఇంటెన్స్‌ యాక్టింగ్‌ కనిపిస్తోంది.

ఇక శుద్ధి యోగ్య అనే అమ్మాయి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుంది. శుద్ధి జీవితంలోని 17 ఏళ్ల వయసు నుంచి 27 సంవత్సారల మధ్య జరిగిన కథను 8 వసంతాలుగా చూపిస్తతున్నారు. అయితే మార్షల్‌ ఆర్ట్స్‌లో ఇది వరకే శిక్షణ పొందిన అనంతిక సనిల్‌కుమార్, ఈ సినిమా చేయడం మరింత సులభమైంది. సున్నితమైన ఈ ప్రేమకథలో అనంతిక పాత్రకు ఫణీంద్ర నర్సెట్టి ఎలాంటి యాక్షన్‌ సీక్వెన్స్‌ లు క్రియేట్‌ చేశాడు? అవి ఈ సినిమా కథకు ఎంతవరక యాప్ట్‌ అవుతాయి? అన్నది సినిమాలో చూడాలి.
మరోవైపు ‘8 వసంతాలు’ సినిమా విడుదల అవుతున్న ఈ నెల 20నే, నాగార్జున–ధనుష్‌ల ‘కుబేర’, ఆమిర్‌ఖాన్‌ ‘సితారే జమీన్‌ పర్‌’ వంటి భారీ సినిమాలూ విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘8 వసంతాలు’ వంటి చిన్న సినిమా..రెండు భారీ సినిమాల మధ్యన ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందన్న విషయం ఆసక్తికరంగా ఉంది.

‘చూడమ్మా..ఆడవాళ్ళు నిప్పు పట్టకూడదు..అంత్యక్రియలకు, కర్మఖండలకు వాళ్ళు పనికిరారు’
‘పనికా రారా..పేగు తెంచిప్రాణం పోయగలిగిన వాళ్ళం..చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా?

‘నా ఆనందాన్ని మిమ్మల్ని సొంతం చేసుకోవాలనుకునే ఆలోచనల్లో కాకుండా..మీరు ఎదురుగా ఉన్నప్పటి క్షణాలన్ని ఆస్వాదించడంలో వెతుక్కున్నా…’

‘ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే..అదే దిశ కాదు..’

‘కొత్త ఫీలింగ్స్‌ వద్దనుకుంటున్నావ్‌..సరే…. మరి పాతవేం చేస్తావ్‌’..‘చంపేసుకుంటాను..’

‘మీ అమ్మ కోసం నీ ప్రేమను వదులుకుంటున్నావా..’

‘ఏదేమైనా నా కూతురు ఇష్టపడిన వాడితోనే దాని పెళ్లి’

‘మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌదాలు..భాగ్యనగరాలు ఉన్నాయ్‌..

‘ఆడదానిప్రేమకేమున్నాయ్‌…మనసులోనే సమాధి చేసుకున్నా…జ్ఞాపకాలు తప్పా..’

Please Share
Share This Article
143 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu