తలైవర్‌ 173 షూటింగ్‌ ఎప్పట్నుంచో తెలుసా..!

Viswa

Web Stories

Thalaiver 173: రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా నటించనున్న కొత్త సినిమా ‘తలైవర్‌ 173’ (Thalaiver 173 update) (వర్కింగ్‌ టైటిల్‌). సిబీ చక్రవర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను కమల్‌హాసన్‌ నిర్మిస్తున్నారు. అలాగే ఈ ‘తలైవర్‌ 173’ సినిమాలో కమల్‌హాసన్‌ కూడా నటించే అవకాశాలు లేకపోలేదు. అలాగే ‘తలైవర్‌ 173’ సినిమాను 2027 పొంగల్‌ సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్‌ ప్రకటించారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందా? అనే ఆసక్తి నెలకొని ఉంది.

అయితే ఈ ‘తలైవర్‌ 173’ సినిమాకు చిత్రీకరణ ఏప్రిల్‌లో (Thalaivar 173 Shoot Update) ప్రారంభం కానుందని, ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని రజనీకాంత్‌ తెలిపారు. పొంగల్‌ శుభాకాంక్షలు తెలుపుతూ, రజనీకాంత్‌ తన ‘తలైవర్‌ 173’ సినిమా వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఇక ప్రస్తుతం ‘జైలర్‌ 2’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు రజనీకాంత్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ‘జైలర్‌ 2’ సినిమా వచ్చే జూన్‌లో థియేటర్స్‌లో విడుదల కానుందని తెలిసింది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos