Shah Rukh Khan king: షారుక్‌ఖాన్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. ‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో షారుక్‌ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో షారుక్‌ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ (suhana khan) ఓ మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, దీపికా పదుకొనె మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. షారుక్‌ఖాన్– దీపిక పదుకొనెల కాంబినేషన్‌లో ‘కింగ్’ ఆరో సినిమా కావడం విశేషం. తాజాగా ‘కింగ్’ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘కింగ్’ను డిసెంబరు 24న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు (Shah Rukh Khan king Release).
అయితే షారుక్ ఖాన్ ‘కింగ్’ (King Movie) సినిమా ఫ్రెంచ్ థ్రిల్లర్ ‘లియోన్: ది ప్రొఫెషనల్’ చిత్రం ఆధారంగా తీస్తు న్నారనే టాక్ బాలీవుడ్‌లో తెరపైకి వచ్చింది. కథ రిత్యా ఈ సినిమాలో…ఓ ఫ్యామిలీని కొందరు డ్రగ్ పెడ్లర్స్ టార్గెట్ చేసి, అందర్నీ చంపేస్తారు. అయితే ఈ ఫ్యామిలీలో ఒక అమ్మాయి మాత్రం బతికి ఉంటుంది. ఈ అమ్మాయిని కాపాడే బాధ్యతను ఓ వ్యక్తి తీసుకుంటాడు. ఈ వ్యక్తి పాత్రలోనే షారుక్‌ఖాన్ నటిస్తున్నాడట. ఆ అమ్మాయి పాత్రలో షారుక్‌ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ నటిస్తుండటం విశేషం.అభిషేక్ బచ్చన్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు (Bollywood news).
ఇక ఈ కింగ్ సినిమాకు తొలుత సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించాల్సింది. సిద్దార్థ్ ఆనంద్ నిర్మాత. కానీ ‘కింగ్’ సినిమా కథ విషయంలో సుజోష్‌కు, షారుక్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో, సిద్ధార్ద్ ఆనంద్‌యే ‘కింగ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సుజోయ్ స్క్రిప్ట్‌తో షారుక్ పాత్రకు చిన్న ఇంపార్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇది షారుక్‌కు నచ్చలేదట. దీంతో సిద్దార్థ్ ఆనంద్ షారుక్ పాత్ర నిడివిని పెంచారట. ఈ విషయంలోనే సుజోష్–షారుక్‌ల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్‌లు వచ్చాయని బాలీవుడ్ టాక్ (Telugu latest news).