Irumudi: 2022లో వచ్చిన ‘ధమాకా’ చిత్రం తర్వాత రవితేజ నుంచి మరో మంచి హిట్ మూవీ రాలేదు. ఈ సినిమా తర్వాత రవితేజ సోలో హీరోగా వచ్చిన ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమైయ్యాయి.
మహేష్ ‘వారణాసి’ లో ప్రభాస్ హీరోయిన్..?
ఈ నేపథ్యంలో రవితేజ కొత్తగా ‘ఇరుముడి’ అనే సినిమాను ప్రకటించారు. జనవరి 26న రవితేజ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘ఇరుముడి’ (Irumudi) సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘ఇరుముడి’ సినిమా ఫస్ట్‌లుక్ ఆసక్తికరంగా ఉంది.
ఈ సినిమాలో రవితేజ, ప్రియాభవానీ శంకర్ భార్యభర్తలుగా నటిస్తున్నారని తెలిసింది. వీరి కుమార్తెగా బేబీ నక్షత్ర నటిస్తున్నారు. భార్యాభర్తల మధ్య భావోద్వేగాలు, కుమార్తెతో వీరి అనుబంధం వంటి అంశాలు ఈ సినిమాలో ప్రధానంగా ఉంటాయట. తప్పిపోయిన కుమార్తె కోసం తల్లిదండ్రులు వెతకడం, ఓ క్రైమ్ ఎలి మెంట్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ ‘ఇరుముడి’ సినిమా ప్రధానకథనం సాగుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.
పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఆ హీరోతో.. సమంత ఓకే చెబుతుందా?
‘ఇరుముడి’ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. త్వరలోనే విడుదల తేదీపై ఓ స్పష్టత వస్తుంది. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోని ఈ 77వ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
రవితేజ జానర్ మార్చి, కొత్త తరహాలో సినిమా చేస్తున్నాడు. మరి..ఈ సినిమాతోనైనా, ‘ఇరుముడి’ చిత్రం సూపర్‌హిట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
