Suriya’s upcoming movies: హీరో సూర్య పరిస్థితి చాలా విచిత్రం. ఆయనకు చేతినిండా సినిమాలు ఉన్నాయి కానీ ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయంపై సరైన స్పష్టత ఉండటం లేదు. సూర్య కెరియర్ లోని 44వ సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2025లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. ఈ చిత్రానికి ముందు సూర్య నుంచి వచ్చిన మరో సినిమా కంగువా (Kanguva) కూడా బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ పరిస్థితిలో సూర్య కెరీర్ కు ఓ మంచి హిట్ సినిమా అవసరమనే చెప్పాలి (Suriya next movie update)
అయితే తెలుగులో ‘రంగ్ దే, సార్ లక్కీ భాస్కర్’ అంటే వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందింది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాకు ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. టైటిల్ అండ్ రిలీజ్ డేట్ పై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. అలాగే సూర్య ఈ సినిమా కంటే ముందు కరుపు అని సినిమా చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా సరైన స్పష్టత లేదు. ఇలా ఒక రెండు సినిమాలు చిత్రీ కరణలను పూర్తి చేసుకొని ఈ రెండు సినిమాల విడుదల తేదీ పై సరైన స్పష్టత లేకపోవడం అనేది సూర్య అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టే విషయమనే చెప్పాలి ( Suriya Tamil movies).
మరోవైపు సూర్య ప్రజెంట్ జీతూ మోహన్ దాస్తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సూర్య పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. అలాగే సూర్య హిందీలో కమిట్ అయిన ‘కర్ణ’ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమా ఆగిపోలేదని, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆల్రెడీ పాటలను సమకూర్చాలని, ప్రీ ప్రిపరేషన్ వర్క్స్ జరుగుతుందని, త్వరలోనే ‘కర్ణ ‘ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఈ చిత్ర దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం జరిగింది.
అలాగే వెట్రి మారన్ డైరెక్షన్లో సూర్య చేయాల్సిన పిరియాడికల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా వాడి వాసల్ కూడా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.కానీ ఈ సినిమా ఆగిపోలేదని లండన్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉన్నాయని, ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభమవుతుందని ఇటీవల ఓ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత ఎస్. థాను చెప్పడం జరిగింది (Suriya future projects).
ఇలా సూర్య చేతిలో ఐదు సినిమాలు ఉన్నప్పటికిని ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయంలో మాత్రం కాస్త గందరగోళం నెలకొని ఉందని చెప్పాలి. మరి ఈ ఏడాది సూర్య నుంచి ఎన్ని సినిమాలు థియేటర్కు వస్తాయో చూడాలి (Tamil actor Suriya movies).