ఓటీటీలో కొత్త రాజాసాబ్‌..ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌ రిలీజ్‌

Viswa
2 Min Read

Web Stories

TheRajasaab on OTT: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన, ‘ది రాజాసాబ్‌’ సినిమా థియేట్రికల్‌ రెస్సాన్స్‌ పాజిటివ్‌గా రాలేదు. మూడున్నర సంవత్సరాల పాటుగా ఈ సినిమా కోసం ప్రభాస్, దర్శకుడు మారుతి జర్నీ చేశారు. కానీ రిజల్ట్‌ తేడా కొట్టింది. పరోక్షంగా చాలెంజ్‌లు చేసిన మారుతిపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో విరుచుపడ్డారు. కొంతమంది ప్రభాస్‌ యాంటి ఫ్యాన్స్‌ కూడా ఇదే అదునుగా, తమ ప్రతిభను సోషల్‌మీడియాలో చూపించుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా జరిగిపోయిన విషయం.

అయితే ఇప్పుడు ‘ది రాజాసాబ్‌’ హంగమా ఓటీటీలో ప్రారంభం కానుంది. విశేషం ఏంటం టే..ఈ సినిమా ఎక్స్‌టెండెడ్‌ కట్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ‘ది రాజాసాబ్‌’సినిమా పుటేజీ దాదాపు నాలుగు గంటలు వచ్చిందని, దీంతో మూడుగంటలకు కుదించి థియేటర్స్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేశామని మారుతి చెప్పారు. ప్రభాస్‌ ఓల్డ్‌ గెటప్‌ సీన్స్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమా ధియేటర్స్‌లో తొలుత విడుదలైనప్పుడు లేవు. ఆ తర్వాత యాడ్‌ చేశారు. ఈ సీన్స్‌కు మంచి స్పందనే లభించింది.

అయితే ఇప్పుడు ‘ది రాజాసాబ్‌’ సినిమా ఫిబ్రవరి 11 నుంచి హాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది (Prabhas TheRajasaab Ott Release). ‘ది రాజాసాబ్‌’ సినిమా ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌ను రిలీజ్‌ చేయనున్నారు మేకర్స్‌.‘ది రాజాసాబ్‌’ సినిమా కోసం మారుతి చాలా ఫుటేజీ వేస్టేజ్‌ చేశారనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఈ తరుణంలో ‘ది రాజాసాబ్‌’ సినిమా ఎక్స్‌టెండ్‌వెర్షన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతున్న నేపథ్యంలో, కొత్తగా ఏ సీన్స్‌ యాడ్‌ చేశారు? స్క్రీన్‌ ప్లేను ఏమైనా మార్చారా? అన్న అంశాలు ఆసక్తిగా మారాయి.

ఇక ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్‌’ సినిమాలో మాళవికా మోహనన్, నిధీ అగ ర్వాల్‌లు హీరోయిన్స్‌గా నటించగా, వీటీవీ గణేష్, ప్రభాస్‌శ్రీను, రిద్దికుమార్, జరీనా వాహబ్, సంజయ్‌దత్, బోమన్‌ ఇరానీ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్‌.తమన్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ (TheRajasaab Cast and Crew).టీజీ విశ్వప్రసాద్‌, క్రుతీప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలైంది.

Please Share
Share This Article
333 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi