ఫ్యామిలీ ఇంత భయంకరంగా ఉంటుందా!

Viswa

Web Stories

Sampradayini Suppini Suddapoosani Release: ‘90స్‌’ వెబ్‌సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న శివాజీ, యాక్టర్‌గా ఆచితూచి అడుగులు వేస్తున్నా రు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కోర్టు’, ఈ ఏడాది డిసెంబరులో విడు దలైన ‘దండోరా’ చిత్రాల్లో శివాజీ నటనకు మంచి పేరు వచ్చింది.

శివాజీ లేటెస్ట్‌ సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కాకుండ హీరోగా నటించారు శివాజీ. లయ హీరోయిన్‌. ఈ చిత్రంలో శివాజీ–లయలు భార్యా భర్తలు నటించగా, వీరి కుమారుడు పాత్రలో రోహన్‌ యాక్ట్‌ చేశాడు. సుధీర్‌ శ్రీరామ్‌ డైరెక్షన్‌తో శివాజీ ఈ సినిమాను నిర్మించాడు. (Sampradayini Suppini Suddapoosani Movie Cast and crew) ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, ఇమ్మాన్యూయేల్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ సినిమా ఈటీవిన్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది (Sampradayini Suppini Suddapoosani Release date). ఈ సందర్భంగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమా ట్రైలర్‌ను (Sampradayini Suppini Suddapoosani Release trailer) రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌కి దర్శకుడు అనిల్‌రావిపూడి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం. ఈ చిత్రంలో పంచాయితీ సెక్రటరీ శ్రీరామ్‌ పాత్రలో యాక్ట్‌ చేశాడు శివాజీ.

‘‘అనగనగ ఒక పంచాయితీ సెక్రటరీ. పేరు శ్రీరామ్‌…’,
‘ఒక్కడు ఒప్పుకోకపోయిన సంతకం పెట్టను’
‘భర్తకు తగ్గ భార్య…ఉత్తర’
‘అతనేవరో డబ్బులు ఇస్తానంటే వద్దన్నారంట..
లంచం తీసుకోవడం నేరమే..’
‘మనీ ప్లాంట్‌…పక్కిట్నించి కొట్టేశా’
‘ఒక ఫ్యామిలీ ఇంత భయంకరంగా ఉంటుందని మొదటిసారి మిమ్మల్ని చూసిన తర్వాతే తెలిసింది’
‘పంచాయితీ సెక్రటరీ శ్రీరామ్‌ మీదే డౌట్‌ వస్తుంది’

విడుదలైన ట్రైలర్‌ను బట్టి, ఈ చిత్రం ఓ మర్డర్‌ మిస్టరీ నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని స్పష్టం అవుతోంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi