please subscribe to Tollywoodhub YouTube channel

యాక్షన్‌ సినిమాల్లో కేజీఎఫ్‌…లవ్‌స్టోరీ మూవీస్‌లో నిలవే: హీరో–దర్శకుడు సౌమిత్‌ రావు

SPM
SPM

Web Stories

nilave movie: సౌమిత్‌ రావు హీరోగా నటించి, సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన సినిమా ‘నిలవే’. శ్రేయాసి సేన్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. రాజ్‌ అల్లాడ, గిరిధర్‌ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13న (Nilave Movie Release Date) రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో యూనిట్‌ నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్రముఖ గాయని సునీత ముఖ్య అతిథిగా విచ్చేసి, ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రదర్శించారు.

అనంతరం సునీత మాట్లాడుతూ–‘‘ఈ సినిమా చూశాను. మంచి అర్థవంతమైన సినిమా ఇది. మ్యూజికల్‌ లవ్‌స్టోరీ చిత్రంగా ఆడియన్స్‌ తీర్పు ఇస్తారని అనుకుంటున్నాను. సఖి, ఏ మాయ చేశావే వంటి సినిమాల తరహాలో ఈ ‘నిలవే..’ చిత్రం కూడా మంచి ఫీల్‌గుడ్‌ మూవీగా ఆడియన్స్‌ను మెప్పిస్తుందని అనుకుంటున్నాను’’ అని అన్నారు.

హీరోయిన్‌ శ్రేయాసి సేన్‌ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా చూశాక, ప్రేమమీద ప్రేక్షకులు ఓ మంచి అభిప్రాయానికి వస్తారు. తెలుగు ఇండస్ట్రీలో కథానాయికగా నటించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు.

Nilave Movie PreRelease Photo

హీరో సౌమిత్‌ పోలాడి మాట్లాడుతూ–‘‘చిన్నప్పట్నుంచి నటుడిని కావాలనేది నా ఆకాంక్ష. మెగాస్టార్‌ చిరంజీవిగారే నాకు స్ఫూర్తి. నన్ను హీరో, దర్శకుడిగా మార్చింది సాయి కే వెన్నం. యాక్షన్‌ మూవీస్‌లో ‘కేజీఎఫ్‌’కు ఎలాంటి ప్రేక్షకాదరణ దక్కిందో, లవ్‌స్టోరీ మూవీస్‌లో మా ‘నిలవే’ సినిమా అలా ఉంటుంది’’ అని మాట్లాడారు.

చిత్ర దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ–‘‘మంచి కంటెంట్‌ ఉన్న సినిమా మాది. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి. ‘డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా గారిని కలిసినప్పుడు ‘ఇక్కడ ఎవరూ క్రిస్టోఫర్‌ నోలన్‌ లేరు.. మన సినిమాను మనమే నమ్మాలి. నాకది వర్క్‌వుట్‌ అయ్యింది. నువ్వు కూడా అదే నమ్ము’ అని చెప్పిన మాట నాలో స్ఫూర్తిని నింపింది’’ అని చెప్పారు

మ్యూజిక్‌ డైరెక్టర్‌ కళ్యాణ్‌ నాయక్‌ మాట్లాడుతూ–‘‘ఫీల్‌గుడ్‌లవ్‌స్టోరీతో సాగే ఈ సినిమాకు సంగీతం చాలా ముఖ్యం. సంగీత ప్రేమకథా చిత్రాల్లో ‘నిలవే’ సినిమా ‘కేజీఎఫ్‌’ రేంజ్‌లో ఉంటుంది. 11 పాటలున్నా కథతో సాగే సినిమా నిలవే’’ అని అన్నారు.

నిర్మాత రాజ్‌ అల్లాడ మాట్లాడుతూ– ‘‘నిన్ననే ప్రీమియర్‌ వేశాం. మంచి స్పందన వచ్చింది. చక్కటి మ్యూజికల్‌ లవ్‌ స్టోరీ. కొత్తవారైనా అందరూ బాగా నటించారు. హీరో కమ్‌ దర్శకుడు సౌమిత్‌ కూడా పాత్రలో లీనమై నటించాడు. ఈ సినిమా యూనిట్‌ అందరికీ ధన్యవాదాలు’’
అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత మాధురి, నటి సత్య శ్రీ, ఆర్‌ అండ్‌ ఎ ట్రావెల్స్‌ అనురాధా, ప్రవీణ కడియాల, ప్రొడ్యూసర్‌ గిరిధర్‌ రావు, నటుడు రూపేష్‌ మాట్లాడి, ఈ సినిమా బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ లవ్‌ డ్రామాగా ప్రేక్షకులను అలరించి, పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi