please subscribe to Tollywoodhub YouTube channel

కన్ఫార్మ్‌…నాగ్‌100వ చిత్రం ఆ దర్శకుడితోనే..!

Viswa
Akkineni Nagarjuna 100th film News Ra. Karthick

Web Stories

సూపర్‌స్టార్‌ నాగార్జున వందో చిత్రం (Nagarjuna100th film) కోసం ఎప్పట్నుంచో సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. నాగార్జున వందో సినిమాకు తమిళ దర్శకుడు నవీన్‌ ఓ కథ చెప్పారనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత మోహన్‌ రాజా తదితరుల పేర్లు వినిపించాయి. కానీ తమిళ దర్శకుడు ఆర్‌ఎ. కార్తీక్‌ (Ra Karthick) చెప్పిన కథ నాగార్జునకు బాగా నచ్చిందట. దీంతో ఈ కథతోనే తన వందో సినిమాను చేయాలని నాగార్జున స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యారు.తన సొంత బ్యానర్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే నాగార్జున వందో చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్‌ లాంచ్‌ జరుగుతుంది. ఆర్‌ఏ. కార్తీక్‌ తో నాగార్జున తన వందో చిత్రాన్ని ఆల్మోస్ట్‌ ఖరారు చేసినట్లుగా, ‘కుబేర’ తెలుగు ప్రమో షన్స్‌లో భాగంగా జరిగిన ఆయన తన వందో సినిమాను గురించినవివరాలను వెల్లడించారని తెలిసింది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుంది? ఈ వందో సినిమాలో నాగచైతన్య, అఖిల్‌లు కూడా ఏమైనా భాగం అవుతారా? అనేది చూడాలి.

మరోవైపు నాగార్జున ఓ లీడ్‌ రోల్‌లో, ధనుష్‌ హీరోగా నటించిన ‘కుబేర’ చిత్రం జూన్‌ 20న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. అలాగే రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాలో నాగార్జున విలన్‌ రోల్‌ చేశారు. ఈ కూలీ చిత్రం ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది. బహుషా..కూలీ సినిమా ప్రమోషన్స్‌ వర్క్స్‌ కూడా పూర్తయిన తర్వాత నాగార్జున తన వందో సినిమాపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టే చాన్సెస్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా అఖిల్‌ హీరోగా చేస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘లెనిన్‌’లోనూ నాగార్జున ఓ గెస్ట్‌ రోల్‌ చేస్తారని, ఈ గెస్ట్‌ రోల్‌ సినిమాలో అఖిల్‌ పాత్రకు తండ్రి రోల్‌ అని టాలీవుడ్‌ సమాచారం.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi