ఈ కోపమంతా ఒకప్పటి ప్రేమ!…విజయ్‌దేవకొండ మైథాలజి ఫిల్మ్‌

Viswa
2 Min Read

Web Stories

vijay deverakonda and shouryuv film: హీరో విజయ్‌దేవరకొండ (vijay deverakonda ), ‘హాయ్‌ నాన్న’ సినిమా ఫేమ్‌ దర్శకుడు శౌర్యువ్‌ (shouryuv film) కాంబినేషన్‌లో సినిమా ఖరారైంది. మైథలాజిక్‌ యూనివర్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది. భారీ క్యాన్వాస్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను వైరా నిర్మాణసంస్థ నిర్మించనుంది. శనివారం ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌పై ‘ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమ’ అని క్యాప్షన్‌ కూడా ఉంది.

ఇక సినిమా టెక్నికల్‌గా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్నట్లుగా తెలుస్తోంది. ‘హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్, ఫాల్‌ ఔట్‌’ వంటి సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్‌ చేసిన అలెజాండ్రో మార్టినెజ్‌ ఈ సినిమాకు వర్క్‌ చేయనున్నారు. ‘గాడ్స్‌ ఆఫ్‌ ఈజిప్ట్, బ్యాట్‌ మ్యాన్‌ ఫరెవర్, స్నోపియర్సర్‌’ వంటి చిత్రాలకు వీఎఫ్‌ ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా వర్క్‌ చేసిన ఎరిక్‌ డస్ట్ర్‌ ఈ చిత్రానికి అసోసియేట్‌ అయ్యారు. ‘ఓం శాంతి ఓం, యూనిమల్‌’ వంటి హిందీ చిత్రాలకు పనిచేసిన ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేష్‌ సెల్వరాజన్‌ ఈ సినిమాకు వర్క్‌ చేస్తారు. హేషబ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారుఈ ఏడాది చివర్లోనే, ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది.

ప్రస్తుతం ‘రణబాలి, రౌడీ జనార్థన’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు విజయ్‌ దేవరకొండ. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలోని ‘రణాబాలి’ సినిమా ఈ సెప్టెంబరు 11న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ‘రౌడీ జానర్థన’ సినిమాను ఈ డిసెంబరులో రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు. కానీ ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒక చిత్రమే ఈ ఏడాది రిలీజ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Please Share
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi