టూత్‌ బ్రెష్‌ కొనివ్వలేదని…తండ్రిపై కొడుకు కేసు…

Kumar NA
1 Min Read
Pallaburusu movie trailer released

Web Stories

Pallaburusu Cinema: ‘బలగం’ ఫేమ్‌ సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన తాజా సినిమా ‘పళ్ళబురుసు’ (Pallaburusu ). ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్‌ మచా ఇతర కీలక పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఆదిత్య పిట్టి, వివేక్‌ కృష్ణాని ఈ సినిమాను నిర్మించారు. ఉదయ్‌ చౌహాన్‌ (Pallaburusu Movie director Uday Chauhan) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 14న (Pallaburusu Release date) థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది.

నలుపురంగే జెండా…కాకే దాని గుర్తు!

తండ్రీకొడుకుల భావోద్వేగాలతో కూడిన కథనంగా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. టూత్‌బ్రెష్‌ కొనివ్వలేదని, కొడుకుపై కేసు వేసే పాత్రలో సుధాకర్‌రెడ్డి నటించగా, ఈ కొడుకు పాత్రలో మురళీధర్‌ గౌడ్‌ నటించాడు. ఈ సినిమాకు పవన్‌ సీహెచ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇంట్లో పెద్దాయనకు పంటి నొప్పి రావడం, ఈ నొప్పి రావడంతో ఆయన హాస్పిటల్‌కి వెళ్లగా, వారు టూత్‌బ్రెష్‌ వాడమని చెప్పడం, ఆయన
కొడుకు…ఆయనకు టూత్‌ బ్రెష్‌ కొనివ్వకపోవడం…వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని తాజాగా విడుదలైన ఈ ‘పళ్లబురుసు’ ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది.

కొరియన్‌ కనకరాజు సినిమా రివ్యూ..కొరియన్‌ దెయ్యంతో రూ. 3 కోట్ల డీల్‌ ఏమైంది?.

సేటు నా కొడుకు మీద కేసు వేయాలి…!
ఎందుకు..! కొట్టిండా..పొడిచిండా…!
నాకు పళ్లబురుసు (టూత్‌బ్రెష్‌) కొనివ్వలేదు….
తాత…టూత్‌ బ్రెష్‌…నొప్పి తగ్గినీకి టాబ్లెట్స్‌ రాసినా…

కేసా..మామానా..?
కేసే..మీ మామనే…నా మీద కేసు వేసిండు…!
ఎందుకిట్ల చేస్తున్నావ్‌…నీకేం కావాలే…!

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu