నాని ది ప్యారడైజ్‌ రివ్యూ..సవారీల తిరుగుబాటు ఫలించిందా?

Viswa
5 Min Read

Web Stories

The Paradise Telugu Movie Review: హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘దసరా’ బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ రాబట్టి, ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. తాజాగా వీరి కాంబినేషన్‌తో ‘ది ప్యారడైజ్‌’ అనే సినిమా తెరకెక్కింది. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి (The Paradise Movie Talk).ఈ సినిమా నేడు (సెప్టెంబరు 24)న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. అయితే ఒకరోజు ముందుగానే, ఈ సినిమా ప్రీమియర్స్‌ను ప్రదర్శించారు. ‘దసరా’ మ్యాజిక్‌ రిపీట్‌ అయ్యిందా? మరి… ‘ది ప్యారడైజ్‌’ సినిమా కోసం నాని పడ్డ కష్టం ఫలించిందా? రివ్యూలో (The Paradise Review Telugu YouTube) చదివేద్దాం.
సినిమా: ది ప్యారడైజ్‌ (The Paradise Review)

ప్రధాన తారాగణం: నాని, కయాదులోహర్, మోహన్‌బాబు, సోనాలీకులకర్ణి, సంపూర్ణేష్‌బాబు, రాఘవ్‌జుయల్‌ (TheParadiseMovieCast and crew)
నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
డీఓపీ: సీహెచ్‌ సాయి
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిడివి: 2 గంటల 54 నిమిషాలు
సెన్సార్‌: ఏ సర్టిఫికేట్‌
రేటింగ్‌: 2.25/5 (The Paradise Review and Rating)

కథ

సంచార జాతి అయిన సవారీ తెగ ప్రజలు ఏ గుర్తింపు లేకుండా దాదాపు 40 సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని ‘ప్యారడైజ్‌’ ప్రాంతంలో నివాసం ఉంటుంటారు. శిఖంజా మాలిక్‌ (మోహన్‌బాబు) ఏలు బడిలో బానిసలుగా బతుకుతున్న తమ సవారీ వాసులకు ప్రభుత్వ గుర్తుంపు కావాలని, ఈ తెగ తరఫున సమ్మక్క (సోనాలీ కులకర్ణి) పోరాటం చేస్తుంటుంది. అవమానించాడని తన చిన్నప్పట్నుంచే శిఖంజా మాలిక్‌పై పగ పెంచుకున్న సమ్మక్క కుమారుడు జడల్‌ (నాని).. శిఖంజామాలిక్‌ తనయుడు విక్రమ్‌ మాలిక్‌ (రాఘవ్‌ జుయల్‌)ను చంపేస్తాడు. కొడుకు చావుతో మరింత రగిలిపోయిన శిఖంజా మాలిక్, సవారీ తెగను నాశనం చేయాలనుకుంటాడు. అసలు..వీరికి గుర్తింపు అన్నదే రాకూడదని మరింత బలంగా నిర్ణయిం చుకుంటాడు. మరోవైపు తల్లి సమ్మక్క చేస్తున్న గుర్తింపు పోరాటానికి జడల్‌ నాయకుడు అవుతాడు. మరి.. తమ సవారీ తెగకు జడల్‌ గుర్తింపును తీసుకుని వచ్చాడా? భారత స్వాతంత్య్రం తర్వాత కూడా సవారీ తెగకు గుర్తింపు లేకపోవడం వెనుక శిఖంజా మాలిక్‌ చేసిన కుట్ర ఏమిటి? అన్నది సిని మాలోని ఆసక్తి కథనం.

Nani and Kayadu Lohar in TheParadise Movie

విశ్లేషణ

సినిమా కథ ప్రధానంగా గుర్తింపు కోసం సాగే పోరాటం, తల్లీకొడుకుల భావోద్వేగం నేపథ్యంతో సాగు తుంది. జడల్‌ చిన్నప్పటి సన్నివేశాలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. గుర్తింపు కోసం సమ్మక్క జరిపే పోరాటం, మరోవైపు సుబ్బులక్ష్మి (కయాదులోహర్‌)తో జడల్‌ లవ్‌ట్రాక్‌తో సినిమా ఫస్ట్‌హాఫ్‌ సాగుతుంది. విక్రమ్‌ మాలిక్‌ డెత్‌తో ఇంట్రవెల్‌ కార్డు పడుతుంది. ఆ తర్వాత జడల్‌ నాయకత్వంలో సవారీ తెగ తమ గుర్తింపుకోసం ఎగ్రెసివ్‌గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? వాటి పర్యవసానాలు ఏమిటి? అన్న అంశాల నేపథ్యంతో ఓ ఎమోషనల్‌ క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది.(The Paradise Movie Talk)

Nani The Paradise movie Review
Nani The Paradise movie Review

ఓ వర్గం గుర్తింపు కోసం చేసే పోరాటం అనగానే వెంటనే…తెలుగు ఆడియన్స్‌కు ఇటీవల రిలీజైన ‘పెద్ది’ సినిమా గుర్తుకు వస్తుంది. ఇంకాస్త వెనక్కి వెళితే…ప్రభాస్‌ ‘ఛత్రపతి’, విజయ్‌దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ కూడా ఈ కోవలోకి వచ్చే చిత్రాలే. ‘ది ప్యారడైజ్‌’ సినిమా కూడా ఈ క్లబ్‌లో మూవీయే. కథ తెలిసిందై నప్పుడు, కథనం అన్న కొత్తగా ఉండాలి. కథనాన్ని కొత్తగా ప్రజెంట్‌ చేయడంతో దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల పూర్తిగా సఫలం కాలేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రేక్షకులు ఊహించగలిగిన సన్నివేశాలు, రోటీన్‌ స్క్రీన్‌ ప్లే, అనవసరమైన చిక్క చిత్రాల ప్రస్తావన..ఇవన్నీ ఆడియన్స్‌ను థియేటర్స్‌లో ఇబ్బందిపెట్టేవే. ప్రతి ఇరవై నిమిషాలకొక తల తెగిపడుతూనే ఉంటుంది. ఈ లెవల్లో హింస స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ చిత్రంలో తల్లీకొడుకుల ఎమోషన్‌ మాత్రం బాగా వర్కౌట్‌ అయ్యింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ ఒకే. ఎమ్‌ఎల్‌ఏ శంకర్‌ అన్న సీన్స్‌ కొంతమంది ఆడియన్స్‌కు హై ఇస్తాయి. నాని జడల్‌ బ్యాక్‌డ్రాప్‌ ఎమోషన్‌ సూపర్‌గా ఉంది. నాని జడలుతో దర్శకుడు అల్లిన ఎమోషనల్‌ ముడి బాగుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

నాని యాక్టింగ్‌లో కష్టం కనిపిస్తోంది. జడలు వేసుకుని కూడా తనదైన మార్క్‌ యాక్టింగ్‌ చేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో నానిని మరింత ఇంపాక్ట్‌ఫుల్‌గా చూస్తారు. సుబ్బలక్ష్మి పాత్రలో కయాదు గ్లామర్‌గా కనిపించింది. శిఖంజామాలిక్‌గా మోహన్‌బాబు క్యారెక్టర్‌ చాలా స్ట్రాంగ్‌ స్టారై్టన, చివర్లో తేలిపోయింది. విక్రమ్ మాలిక్ గా రాఘవ్ ఓకే. కానీ ఈ రోల్ ప్రెజెంటేషన్ లో కొత్తదనం లేదు. ఇక ఈ సినిమాకు మరో హీరోలాంటి రోల్‌ అంటే..సమ్మక్కది. ఈ పాత్రలో సోనాలీ కులకర్ణి అద్భుతంగా పెర్ఫార్మెన్స్‌ చేశారు. కొన్ని ఎమోషలన్‌ సీన్స్‌లో అదరగొట్టారు. కొన్ని సీన్స్‌లో తనలోని మాస్‌ యాంగిల్‌ని కూడా బయటకు తీశారు.బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్‌బాబు ఒకే. ఎమ్‌ఎల్‌ఏ శంకరన్నగా ప్రియదర్శి, ఓ లాయర్‌ పాత్రలో సత్యరాజ్‌ అతిథి పాత్రల్లో మెరిశారు. ఈశ్వరీరావు, తనికెళ్లభరణి, రాజా రవీంద్ర, సత్యప్రకాష్‌ వారి వారి పాత్రల పరిధిమేరకు నటించారు.

Nani TheParadise Movie Review in Telugu
Nani TheParadise Movie Review in Telugu

యాక్షన్, తల్లీకొడుకుల ఎమోషన్, గుర్తింపుకోసం సాగే పోరాటం…ఈ మూడు అంశాలు కథలో సరిగ్గా బ్లెండ్‌ కాలేదు. కథలోని లోపాలను యాక్షన్‌ సీక్వెన్స్‌లతో కప్పిపుచ్చాలన్న దర్శకుడు ప్రయత్నం వల్ల ఆడియన్స్‌కు విసుగు వస్తుంది. ఫస్ట్‌హాఫ్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించే సమ్మక్క, శిఖంజా మాలిక్‌ పాత్రలు ఒక్కసారిగా సెకండాఫ్‌లో డౌన్‌ అయిపోయాయి. సెకండాఫ్‌లో హీరోయిన్‌ పాత్ర ఎందుకో ఎవరికీ అర్థం కాదు. ప్రీ క్లైమాక్స్‌ సెటప్‌ కూడా సరిగ్గా సెట్‌ కాలేదు. ప్రేక్షకులు ఊహించగలిగిన క్లైమాక్స్‌నే సినిమా ఎండింగ్‌లో కనిపిస్తుంది. పెద్ద సర్‌ప్రైజ్‌ ఏమీ ఉండదు. ఇక సినిమాకు మరో ప్రాణంగా నిలిచింది అనిరు«ద్‌ రవిచందర్‌ మ్యూజిక్‌. ఆయా షేర్, ఏషనాగుల పాట, సమ్మక్క, నా కొడుకా…పాటలు బాగున్నాయి. ఆర్‌ఆర్‌ అక్కడ డక్కడ బాగుంది. సెకండాఫ్‌లో నానీ డైలాగ్స్‌ సరిగ్గా ఆడియన్స్‌కు అర్థం అవుతాయా? అన్నది ఓ సందేహం. విజువల్స్‌ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నవీన్ ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. (The Paradise Latest Review)

బలాలు

  • నాని, సోనాలీకులకర్ణి యాక్టింగ్‌
  • తల్లీకొడుకుల ఎమోషన్‌
  • మ్యూజిక్‌

బలహీనతలు

  • కొత్తదనం లేని కథనం
  • మితీమిరిన హింసాత్మక సన్నివేశాలు
  • ఊహించగలిగిన సన్నివేశాలు
  • అనవసరమైన యాక్షన్‌

ఫైనల్‌గా… ‘ది ప్యారడైజ్‌’ బిర్యానీలో రుచి లేదు!. యాక్షన్‌ వాసన ఎక్కువై, కథ రుచి లేకుండా పోయింది.(The Paradise Movie Verdict)

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu