పవన్‌కల్యాణ్‌ ఓజీ ఓవర్‌

Viswa
2 Min Read

Web Stories

ఎట్టకేలకు ‘ఓజీ’ (Pawankalyan OG Movie) సినిమా షూటింగ్‌ను పవన్‌కల్యాణ్‌ పూర్తి చేశాడు. సుజిత్‌ డైరెక్షన్‌లోని గ్యాంగ్‌ స్టర్‌ డ్రామా చిత్రం ఇది. డీవీవీ దానయ్య, ఆయన కొడుకు కల్యాణ్‌దాసరి ఈ సినిమాకు నిర్మా తలు. ఇపాటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని, థియేటర్స్‌లోకి రావాల్సిన ఈ ఓజీ సినిమా ఇంకా రిలీజ్‌ కాలేదు. పవన్‌కల్యాణ్‌ రాజకీయాల కమిట్‌మెంట్స్‌ కారణంగా, ఈ మూవీ రిలీజ్‌ కాలేదు. ఫైనల్‌గా 2025 జూన్‌ 7వ తేదీతో ‘ఓజీ’ (pawankalyan completes OG Movie Shooting) సినిమాలో పవన్‌కల్యాణ్‌ వంతు షూటింగ్‌ పూర్తయింది.

కొంత గ్యాప్‌ తర్వాత మొదలైన ఓజీ సినిమా షూటింగ్‌ కీలక షెడ్యూల్‌ ముంబైలో జరిగింది. ఓజీ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభం కాగానే, వెంటనే …పవన్‌కల్యాణ్, ఇమ్రాన్‌హష్మిల మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత విజయవాడలో చిత్రీకరణ జరిగింది. ప్రధా నంగా యాక్షన్‌ సన్నివేశాలనే చిత్రీకరించారు మేకర్స్‌.

ఇందులో గంభీర అనే పాత్రలో కనిపిస్తారు పవన్‌కల్యాణ్‌ (Pawankalyan OG). ప్రియాంకా అరుల్‌ మోహన్‌ . అర్జున్‌ దాస్, శ్రీయారెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఓజీ సినిమాలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి విలన్‌గా నటిస్తున్నాడు. ఓజీ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 25న (OG Movie Release date) విడుదల కానుంది. నిజానికి ఓజీ సినిమాను గత ఏడాది సెప్టెంబరు 27నే రిలీజ్‌ చేద్దామను కున్నారు. కానీ వీలుపడలేదు. మరోవైపు ఓజీ సినిమా రెండు పార్టులుగా విడుదల అయ్యే చాన్సెస్‌ కనిపిస్తున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా ఓ పాటను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు మేకర్స్‌. తమిళ నటుడు శింబు ఓజీ సినిమా కోసం ఓ పాట పాడాడు. ముందుగా ఆ పాటను రిలీజ్‌ చేద్దామనుకుంటున్నారట మేకర్స్‌.

ఇక పవన్‌కల్యాణ్‌ నటించిన మరో తాజా చిత్రం ‘హరిహరవీరమల్లు’ మూవీ ఈ జూన్‌ 12న విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అతి త్వరలోనే కొత్త విడుదల తేదీ రానుంది. అయితే హరిహరవీరమల్లు విడుదలైన తర్వాతే, ఓజీ సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది.

ఇంకా వచ్చే వారంలోనే హరీష్‌శంకర్‌తో ‘ఉస్తాద్‌భగత్‌సింగ్‌’ సినిమా షూటింగ్‌తో పాల్గొంటాడు పవన్‌కల్యాణ్‌. శ్రీలీల ఈ మూవీ హీరోయిన్‌. మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi