ప్రభాస్‌ బాహుబలి:ది ఎపిక్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..!

Viswa

Web Stories

Baahubali The Epic OTT: ప్రభాస్‌ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘బాహుబలి:ది బిగినింగ్, బాహుబలి:ది కన్‌క్లూజన్‌’..ఇలా రెండు పార్టులుగా విడుదలైంది. ‘బాహుబలి:ది బిగి నింగ్‌ (2015), బాహుబలి:ది కన్‌క్లూజన్‌ (2017)’…ఈ రెండు సినిమాలూ సూపర్‌హిట్‌గా నిలిచాయి. అయితే దర్శకుడు రాజమౌళి, ‘బాహుబలి:ది బిగి నింగ్‌ (2015), బాహుబలి:ది కన్‌క్లూజన్‌ (2017)’ సినిమాలను కలిపి ఒకే చిత్రంగా ‘బాహుబలి: ది ఎపిక్‌’ పేరిట ఈ ఏడాది అక్టోబరు 31న విడుదల చేశారు. ‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమాను రిలీజ్‌ చేసినట్లుగా మేకర్స్‌ తెలిపారు.

కాగా, ‘బాహుబలి: ది ఏపిక్‌’ సినిమా ఈ డిసెంబరు 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.ఇక ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమాలో అను ష్కా శెట్టి, తమన్నా, రానా, నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్‌లు మెయిన్‌ లీడ్‌ రోల్స్‌లో నటించారు. అడివి శేషు, సుబ్బరాజు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించారు.

Please Share
3 Comments
  • Mad Pursuit — A survival racing gauntlet where clean lines and split-second choices decide how long you last. Thread past roadblocks, bait patrol cars into wrecks, and unlock tougher rides as the chase intensifies. Master late lane-swaps and risk-managed nitro bursts to extend your run. Challenge: go no-damage for 90 seconds and drop your best time—proof required.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi