రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ

Viswa

Web Stories

Bhartha Mahasayulaku Vignyapthi Review: ఇటీవలి కాలంలో రవితేజ ఎక్కువగా మాస్‌ మూవీస్‌యే చేశాడు. కొంత గ్యాప్‌ తర్వాత రవితేజ ఫ్యామిలీ జానర్‌లో చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ఈ సంక్రాంతికి విడుదలైంది. కిషోర్‌ తిరుమల డైరెక్ట్‌ చేశారు. మరి..ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయో..ఓ సారి రివ్యూలో చూసేద్దాం.

సినిమా: భర్తమహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Vignyapthi Review)
తారాగణం: రవితేజ, డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్, సత్య, తారక్‌ పొన్నప్ప, ‘వెన్నెల’ కిషోర్, సునీల్‌
దర్శకత్వం: కిషోర్‌ తిరుమల
నిర్మాణం: సుధాకర్‌ చెరుకూరి
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ల
ఎడిటింగ్‌: శ్రీకర్ ప్రసాద్
విడుదల తేదీ: 13-01-2026
రేటింగ్‌:2.5/5 (Bhartha Mahasayulaku Vignyapthi Review and Rating)

కథ 

Bhartha Mahasayulaku Vignyapthi Telugu review: రామ సత్యానారాయణ (రవితేజ), బాలామణి (డింపుల్‌ హయతి) భార్యాభర్తలు. ఓ వైన్‌ కంపెనీకి రామ సత్యానారయణ సీఈవో కాగా, బాలామణి ఎండి. వీరి తమ కంపెనీలో ‘అనార్కలి’ అనే ఓ కొత్త వైన్‌ ప్రొడక్ట్‌ని స్టార్ట్‌ చేస్తారు. స్పెయిన్‌లో ఉన్న యూనైటెడ్‌ స్పిరిట్స్‌ కంపెనీ ఎండీ మానసా శెట్టి (ఆషికా రంగ నాథ్‌)తో బిజినెస్‌ పరంగా కోలాబరేట్‌ అవ్వాలనుకుంటారు. కానీ మానసా శెట్టి పీఏ గోవింద (హాస్య నటుడు సత్య) ఇందుకు అడ్డుపడతాడు. సమస్యను సాల్వ్‌ చేయడానికి రామసత్యనారాయణ స్పెయిన్‌కి వెళ్లి, అక్కడ మానసా శెట్టికి దగ్గరవుతాడు. కానీ తనకు బాలమణితో వివాహం జరిగిందనే విషయాన్ని మా త్రం చెప్పలేకపోతాడు. ఈ క్రమంలో మానసా, రామసత్యానారాయణ ఓ నైట్‌ స్పెండ్‌ చేస్తారు (Bhartha Mahasayulaku Vignyapthi Review)

Raviteja Bhartha Mahasayulaku Wignyapthi Movie Telugu Review

ఆ తర్వాత వైన్‌ ఫెస్టివల్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా మానసా హైదరాబాద్‌ వస్తారు. అక్కడ రామసత్యా నారా యణకు ముందే వివాహం అయ్యిందని, ఈ విషయం తన దగ్గర దాచి, తనతో ఓ నైట్‌ స్పెండ్‌ చేశాడని మా నసకు తెలుస్తుంది. పైగా తన అనార్కలి వైన్‌ బ్రాండ్‌ బిజినెస్‌ డీల్‌ కోసమే రామసత్యానారాయణ స్పెయిన్‌కి వచ్చి, తనను మోసం చేశాడని అనుకుంటుంది. ఆ తర్వాత తనతో స్పెయిన్‌కు రావాలని లేకపోతే, విషయం అంతా బాలామణికి చెబుతానని రామసత్యనారాయణకు వార్నింగ్‌ ఇస్తుంది మానస. ఇదిలా ఉండగానే…ఓ పబ్‌లో మానస, బాలామణి స్నేహితులైపోతారు. బాలామణి భర్తే రామసత్యానారాయణ అని మానసకు తెలుస్తుంది. మరి.. ఆ తర్వాత ఏం జరిగింది. మానస, బాలామణిల మధ్యలో రామసత్యానారాయణ ఎలా నలిగిపోయాడు? తన భర్త గురించి నిజం తెలుసుకున్న బాలామణి ఏం ఏ నిర్ణయం తీసుకుంది. బాలా మణి – సత్యలను రామసత్యానారాయణ ఎలా కన్వెన్స్‌ చేయగలిగాడు? అన్న ఆసక్తికరమైన అంశాలను సినిమాలో చూడొచ్చు.

చిరంజీవి మనశంకరవరప్రసాదుగారు ఫస్ట్‌ రివ్యూ

విశ్లేషణ

ప్రతి మనిషిలోనూ మంచి, చెడులు చెప్పే ఓ ఇన్నర్‌ వాయిస్‌ ఒకటి ఉంటుందని, చెడు చెప్పే ఇన్నర్‌ వాయిని తెలివిగా ఆలోచించి, తప్పు చేయకూడదనే పాయింట్‌ను ఫ్యామిలీ డ్రామాతో చక్కగా డీల్‌ చేశాడు దర్శకుడు కిషోర్‌ తిరుమల.

Raviteja Bhartha Mahasayulaku Wignyapthi Movie First and Pre Review

రామసత్యానారాయణ స్పెయిన్‌ వెళ్లడం, అక్కడ మానసకు దగ్గర కావడం, మళ్లీ ఓ పనిపై మానస హైదరా బాద్‌కు రావడంతో ఫస్టాప్‌ ముగుస్తుంది. రామసత్యనారాయణ గురించి మానస, బాలామణిలకు నిజాలు తెలియడం, ఇద్దర్నీ కన్వెన్స్‌ చేసేందుకు రామసత్యానారాయణ ఏం చేశాడనే విషయంతో సెకండాఫ్‌ పూర్త వుతుంది. తొలిభాగం చాలా సరదాగా సాగిపోతుంది. సత్య, వెన్నెల కిషోర్, మురళీగౌడ్‌ల కామెడీ సీన్స్‌ ఆడియన్స్‌కు నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా సునీల్‌ను మంచి కామిక్‌ వే లో రాసుకున్నాడు దర్శకుడు కిషోర్‌. కానీ సెకండాఫ్‌తో కథనం గాడి తప్పింది. కాస్త సాగదీతగా అనిపించింది. తనను ఎవరు మోసం చేశారో మానస చెప్పకపోవడం, ఈ క్రమంలో మానస నుంచి నిజాన్ని రాబాట్టాలని ఆమె అన్నయ్య చేసే ప్రయత్నాలు, సీసీ ఫుటేజ్‌ సీన్, ప్రీ క్లైమాక్స్‌ సంక్రాంతి సీన్‌…ఇవన్నీ చాలా రోటీన్‌గా, సాగదీతగా అని పించాయి. మానస,ఆమె అన్నయ్య రాకేష్‌ల మధ్య ఉండే ట్రాక్‌…‘గీతగోవిందం’ సినిమాలోని రష్మికా మందన్నా–సుబ్బరాజుల ట్రాక్‌ను గుర్తు చేస్తుంది. క్లైమాక్స్‌ కూడా సాదాసీదాగా ముగిసింది. బలమైన ఎమోషనల్‌ సీన్స్‌ పడలేదు. సునీల్, వెన్నెల కిషోర్, మురళీధర్‌ గౌడ్, సత్యల కామెడీ సెకండాఫ్‌లో వర్కౌట్‌ కాలేదు. సెకండాఫ్‌లో ఒకట్రెండు కామెడీ సీన్స్‌ అయితే వర్కౌట్‌ అయ్యాయి.

ప్రభాస్‌ ది రాజాసాబ్‌ రివ్యూ

నటీనటులు–సాంకేతిక నిపుణులు

రీసెంట్‌గా రవితేజను యాక్షన్‌ హీరోగానే చూశారు ఆయన అభిమానులు. వారి ఈ సినిమా కాస్త రీఫ్రెషింగ్‌ గా అనిపిస్తుంది. రవితేజ యాక్టింగ్, కామెడీ టైమింగ్‌ బాగుంది. ఇక గృహిణిగా డింపుల్‌ హయతి (Dimple Hayathi) రోల్‌ సె టిల్డ్‌గా బాగా అనిపిస్తుంది. యాక్టింగ్‌కు పెద్ద స్కోప్‌ ఉన్న పాత్రలా అనిపించలేదు. రెగ్యులర్‌ హౌస్‌వైఫ్‌ రోల్‌గా అనిపించింది. మానసాగా ఆషిక (Ashika Ranganath) ఈ సినిమాలో గ్లామరస్‌ అండ్‌ మోడ్రన్‌ అమ్మాయిగా యాక్ట్‌ చేసింది. తొలిభాగంలో ఆషిక హైలైట్‌ అయితే, సెకండాఫ్‌లో డింపుల్‌ క్యారెక్టర్‌ హైలైట్‌గా ఉంటుంది. రామసత్యనారాయణ పీఏ లీలాగా వెన్నెల కిషోర్, మనసా శెట్టి పీఏగా హాస్యనటుడు సత్య, సైకలాజిస్ట్‌గా మురళీధర్‌ గౌడ్, మానస అన్నయ్య రాకేష్‌శెట్టిగా తారక్‌ పొన్నప్ప, రాకేష్‌ శెట్టి పీఏగా మంజు…వారి వారి పాత్రల్లో నటించారు. అజయ్‌ఘోష్‌, హర్షలు చిన్న గెస్ట్‌ రోల్స్‌ చేశారు.

చెప్పాలనుకున్న పాయింట్‌ను కాస్త కామిక్‌లో చెప్పాలన్నారు దర్శకుడు కిషోర్‌ తిరుమల. ఇందులో ఆయన సక్సెస్‌ అయ్యారు. కానీ తన బలమైన ఎమోషనల్‌ రైటింగ్‌ను ఎందుకో ఆయన ఈ సినిమాలో కాస్త పక్కనపెట్టారనిపించింది. అసలు ఆశికపై ఎందుకు ఏటాక్స్‌ జరుగుతున్నాయన్న విషయంలో క్లారిటీనే లేదు.  భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్, పాటలు బాగున్నాయి. ఆర్‌ఆర్‌ ఒకే. విజువల్స్, నిర్మాణ విలువలు బాగు న్నాయి. సెకండాఫ్‌లో కాస్త ఎడిట్‌ చేయవచ్చు. ముఖ్యంగా సీసీ పుటేజ్‌ ట్రాక్, సంక్రాంతి సీన్స్‌. ఓవరల్‌గా ఈ సినిమాను ఓ సారి చూడొచ్చు. (భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ)

ఫైనల్‌గా…భార్యకు అన్యాయం చేయకూడదు, జరిగిన తప్పును సరిద్దుకోవాలని తాపత్రయపడే ఓ భర్త కథే ఈ సినిమా. కామిక్‌ వేలో చూపించారు. హ్యూమర్, డైలాగ్స్‌ బాగున్నప్పటికీని, రోటీన్‌ కథ–స్క్రీన్‌ ప్లే, పేలవమైన క్లైమాక్స్‌ ఈ సినిమాకు మైనస్‌ పాయింట్‌లు. సింపుల్‌గా చెప్పాలంటే…ఇంట్లో ఇల్లాలు. .హోటల్‌లో ప్రియురాలు (Bhartha Mahasayulaku Vignyapthi verdict)

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi