శర్వానంద్‌ ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా రివ్యూ

Viswa

Web Stories

సినిమా: నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari Review )
నటీనటులు: శర్వానంద్, సాక్షీ వైద్య, సంయుక్త, వీకే నరేశ్, సంపత్‌రాజ్, సత్య, సిరిహనుమంతు, వెన్నెల కిషోర్, సునీల్‌
దర్శకత్వం: రామ్‌ అబ్బరాజు (Nari Nari Nadumamurari Rating)
నిర్మాణం: అనిల్‌సుంకర, రామబ్రహ్మం సుంకర
సంగీతం: విశాల్‌చంద్రశేఖర్‌
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, యువరాజ్‌
నిడివి:2 గంటల 25 నిమిషాలు
విడుదల తేదీ: 14-01-202
రేటింగ్‌: 2.75/5 (Nari Nari Naduma Murari Review and Rating)

కథ (Nari Nari Naduma Murari story review)

గౌతమ్‌ (శర్వానంద్‌) ఆర్కిటెక్చర్‌. అదే కంపెనీలో సివిల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నిత్య (సాక్షీ వైద్య)ని ప్రేమిస్తాడు. నిత్య కూడా గౌతమ్‌ని ప్రేమిస్తుంది. (Nari Nari Naduma Murari Review) గౌతమ్‌–నిత్య పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. నిత్య తండ్రి లాయర్‌ రామలింగం (సంపత్‌రాజ్‌) తొలుత వీరి వివాహానికి నో చెప్పినా, ఆ తర్వాత సరే అంటాడు. కానీ పెళ్లి మాత్రం రిజిస్టార్‌ ఆఫీస్‌లోనే జరగాలని కండీషన్‌ పెడతాడు. దీంతో నిత్యతో పెళ్లి కోసం రిజిస్టర్‌ ఆఫీసులో దరఖాస్తు చేసుకుంటాడు గౌతమ్‌ (Nari Nari Naduma Murari movie review. కానీ గతంలోనే దియా (సంయుక్త)ను గౌతమ్‌ పెళ్లిచేసుకున్నప్పుడు ఉన్న రిజిస్టారే ఇప్పుడూ ఉంటాడు. దీంతో నిత్యతో గౌతమ్‌ పెళ్లి జరగాలంటే… దియా తో గౌతమ్‌ విడిపోయినట్లుగా, విడాకుల సర్టిఫికేట్‌ కావాలని రిజిస్టార్‌ కండీషన్‌ పెడతాడు. దీంతో విడాకుల సర్టిఫికేట్‌ కావాలని దియాను అడుగుతాడు గౌతమ్‌. అలాగే తన తొలి పెళ్లి గురించి నిత్యకు తెలియకుండ, ఆపసోపాలు పడుతుంటాడు. మరి..గౌతమ్‌కు దియా విడాకుల సర్టిఫికేట్‌ ఇచ్చిందా? గౌతమ్‌ తొలిపెళ్లి గురించి నిత్యకు తెలిసిందా? గౌతమ్‌ తండ్రి నాన్న కార్తీక్‌ లేటు వయసులో పల్లవి (సిరి హనుమంతు)ను ఎందుకు పెళ్లిచేసుకున్నాడు? అన్న ఇంట్రెస్టింగ్‌ విషయాలను థియేటర్స్‌లోనే చూడాలి (Nari Nari Naduma Murari movie review).

నవీన్‌ పొలిశెట్టి అనగనగా ఒకరాజు ఫస్ట్‌ రివ్యూ

విశ్లేషణ

ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే గౌతమ్‌ అనే అబ్బాయి కథే ఈ చిత్రం. ఈ కథను మంచి కామిక్‌గా, మంచి సన్నివేశాలతో డైరెక్ట్‌ చేశాడు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. అలాగే కుర్రతనంలో యువతీయవకులు చేసే కొన్ని పొరపాట్లు, వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ విషయంలో యువత ఎలా జా గ్రత్తగా ఉండాలనే అంశాన్ని ఆలోచించేలా, కథలో ఏర్పాటు చేశాడు కథా రచయిత భానుభోగవరపు. ఈ కథకు నందు అందించిన డైలాగ్స్‌ బాగా ప్లస్‌ అయ్యాయి. రామ్‌ అబ్బరాజు–నందు–భాను భోగవరపు.. కాంబో అంటే ‘సామజవరగమన’ సినిమా గుర్తొస్తుంది. ఈ హిట్‌ సినిమా తరహాలోనే, మంచి కామిక్‌ సన్నివేశాలతో ఈ ‘నారీ నారీ నడుము మురారీ’ సినిమా కథనం సాగుతుంది. పాతికేళ్ల పల్లవిని తీసుకొచ్చి తన తండ్రి కార్తీక్‌తో గౌతమ్‌ పెళ్లి చేయడం, ఆ తర్వాత నిత్యతో గౌతమ్‌ పెళ్లి విషయం, కేరళలో దియాతో గౌతమ్‌ లవ్‌ట్రాక్‌…ఇలా చకా చకా సినిమా కథనం సాగుతుంది. ఎప్పుడైతే…విడాకుల సర్టిఫికేట్‌ అంశం తెరపైకి వస్తుందో అప్పట్నుంచి కథలో మెయిన్‌ కాన్‌ఫ్లిక్ట్‌ స్టార్ట్‌ అవుతుంది.

Nari Nari Naduma Murari (1)

రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ

హీరో తన తప్పును కవర్‌ చేసుకునేందు….తన తండ్రి కార్తీక్‌ను మరో ప్రాబ్లమ్‌లో ఇరికించడం, ఇక్కడ్నుంచి జనరేట్‌ అయ్యే కామెడీ అంతా బాగుంటుంది. మధ్యలో గుణశేఖర్‌ (వెన్నెల కిషోర్‌) పాతపూజ హంగామా అంతా కామెడీగానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌ కాస్త ఎమోషనల్‌గా అనిపించినా, క్లైమాక్స్‌ మాత్రం ఆడియన్స్‌ మంచి వినోదాత్మక సినిమా చూశామనే శాటిస్‌ఫ్యాక్షన్‌తో బటయకు వస్తారు. జెన్‌జీ కామెడీ, డైలాగ్స్‌ కుదిరాయి. ఆర్యగా శ్రీవిష్ణు ఏంట్రీ కుదిరింది.

నటీనటులు-సాంకేతిక నిపుణులు

గౌతమ్‌ పాత్రలో శర్వానంద్‌ (Sharwanand Nari Nari Naduma Murari review) మంచి నటనను కనబరిచాడు. తనదైన స్టైల్‌ ఆఫ్‌ కామెడీ టైమింగ్, తన శైలి డైలాగ్స్‌తో ఆడియన్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఈ సినిమాతో శర్వానంద్‌కు యాక్టర్‌గా మంచి రిలీఫ్‌ వచ్చిన ట్లుగా కచ్చితంగా చెప్పవచ్చు. నిత్యా పాత్రలో సాక్షీ వైద్య మంచి నటనను చూపించింది. యాక్టింగ్‌కు స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ చేశారనిపించింది. దియాగా సంయుక్త యాక్టింగ్‌ కూడా బాగానే ఉంది. ఇక ఈ సినిమాకు మెయిన్‌ పిల్లర్‌ కార్తీక్‌గా వీకే నరేశ్‌ యాక్టింగ్‌ ఈ సినిమాకు మేజర్‌ హైలైట్‌. సీమంతం సీన్, సెకండాఫ్‌లో కోర్టు సీన్స్‌లో నరేశ్‌ మంచి కామెడీ యాక్టింగ్‌ చూపించారు. లవర్స్‌ను కలిపే లవకుశగా సత్య, రిజిస్టార్‌ సత్యమూర్తిగా సునీల్, గురువును ఆరాధించే వ్యక్తి గుణశేఖర్‌ పాత్రలో వెన్నెల కిషోర్‌ కామెడీ ఒకే. ఆర్యగా శ్రీవిష్ణు మెరిశారు.

ప్రభాస్‌ ది రాజాసాబ్‌ రివ్యూ

రామ్‌ అబ్బరాజు ఈ సినిమా కథను బాగానే డైరెక్ట్‌ చేశాడు. మంచి స్క్రీన్‌ ప్లేను సెట్‌ చేసుకున్నాడు. భాను భోగవరపు అందించిన కథ మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కానీ 60 ఏళ్ల వ్యక్తితో, 25 సంవత్సరాల అమ్మాయి ప్రేమ కాన్సెప్ట్‌ సరైన మేసేజ్‌ కాదెమోనని ఆడియన్స్‌కు అనిపించవచ్చు. విజువల్స్, ఎడిటింగ్‌ వర్క్‌ ఒకే. విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌ పర్వాలేదు.నిర్మాణ విలువలు ఈ సినిమా స్టోరీకి తగ్గట్లుగా ఉన్నాయి.

ఫైనల్‌గా.. వినోదాన్ని ఆశించి థియేటర్స్‌కు వెళ్లే వారిని ‘నారీ నారీ నడుము మురారి’ సినిమా అలరిస్తుంది. నవ్విస్తుంది. కానీ మధ్యలో కొంత ల్యాగ్‌ ఉంది. కానీ కథలో ఉన్న కామెడీ ఈ లోటును ఆడియన్స్‌ ఫీల్‌ అయ్యేలా చేయ్యదు. థియేటర్స్‌లో ఈ సినిమాను ఓ సారి చూడొచ్చు (Nari Nari Naduma Murari verdict).

 

Please Share
6 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi