చిరంజీవి కెరీర్‌లో టాప్‌ మనశంకరవరప్రసాద్‌గారు

Viswa
1 Min Read

Web Stories

manashanakaravaraprasadh collections: చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మనశంకరవరప్రసాద్‌గారు’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు వసూళ్లను రాబడుతుంది. సంక్రాంతి సందర్భంగా ఈ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. కాగా, ఏడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ. 292 కోట్ల రూపాయాల కలెక్షన్స్‌ను సాధించిందని చిత్రయూనిట్‌ చెబుతోంది (manashanakaravaraprasadh box office).

 

అలాగే ఓవర్‌సీస్‌ బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా 3 మిలియన్ల డాలర్‌ మార్క్‌ను అందుకుందని చిత్రయూనిట్‌ చెబుతోంది. అంటేదాదాపు రూ. 25 కోట్ల రూపాయాల కలెక్షన్స్‌ను ఓవర్‌సీస్‌లో ఈ సినిమా రాబట్టింది. ఇలా చిరంజీవి కెరీర్‌లో ఓవర్‌సీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘మనశంకరవరప్రసాద్‌గారు’ సినిమా నిలిచింది. అలాగే దర్శకుడు అనిల్‌ రావిపూడి కెరీర్‌లోనూ ఓవర్‌సీస్‌లో 3 మిలియన్ల మార్క్‌ను అందుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం (manashanakaravaraprasadh hit). ఇంకా ఈ సినిమా థియేటర్స్‌లో ప్రదర్శించబడుతుంది. అతి త్వరలోనే ఈ చిత్రం రూ. 300 కోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధిస్తుందని ఊహించవచ్చు. ప్రస్తుత ట్రెండ్‌ని బట్టి, చూస్తే ‘మనశంకరవరప్రసాద్‌గారు’ సినిమా రిజినల్‌ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేలానే కనిపిస్తోంది (manashanakaravaraprasadh latest box office update). లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

ఇక చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మనశంకరవరప్రసాద్‌గారు’. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించగా, వెంకటేశ్‌ మరో కీలక పాత్రలో నటించాడు. సచిన్‌ ఖేడ్కర్, సుదేవ్‌ నాయర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

Please Share
Share This Article
10 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu