please subscribe to Tollywoodhub YouTube channel

మెగా అండర్‌స్టాండింగ్‌ నెక్ట్స్‌ లెవల్‌!

Viswa

Web Stories

MegaHeroes: ఈ రోజుల్లో స్టార్‌ హీరో సినిమాకైనా సరే రిలీజ్‌ డేట్‌ చాలా కీలకంగా మారింది. అందుకెనెమో.. టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోలు రీసెంట్‌ టైమ్స్‌లో ఎక్కువగా పండగ రిలీజ్‌ డేట్, పబ్లిక్‌ హలీ డేలను టార్గెట్‌ చేస్తూ తమ కొత్త సినిమాల రిలీజ్‌ డేట్‌లను ఫిక్స్‌ చేసుకుంటున్నారు. రిలీజ్ డేట్ మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది.

ఈ రిలీజ్‌ డేట్‌ల విషయంలో మెగా హీరోల మధ్య మంచి అండర్‌స్టాడింగ్‌ ఉన్నట్లుగా తెలు స్తుంది. చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాను 2025 జనవరి 10న రిలీజ్‌ చేయాలనుకున్నారు.కానీ ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌పై తీవ్ర విమర్శలు రావడంతో, ‘విశ్వంభర’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. కానీ సంక్రాంతి ఫెస్టివల్‌ రిలీజ్‌ డేట్‌ అయిన జనవరి 10న రామ్‌చరణ్‌ ‘గేమ్‌చేంజర్‌’ సినిమా విడుదలైంది. ఇలా చిరంజీవి ‘విశ్వంభర’ ప్లేస్‌లోకి రామ్‌చరణ్‌ ‘గేమ్‌చేంజర్‌’ వచ్చింది.

ఈ ఏడాది రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా మార్చి 26న ‘పెద్ది’ సినిమాను రిలీజ్‌ చేయాలను కున్నారు. ఆ సమయంలో పవన్‌కల్యాణ్‌ ‘ఉస్తాద్‌భగత్‌సింగ్‌’ సినిమా రిలీజ్‌ను ఏప్రిల్‌కి ప్లాన్‌ చేశారు. కానీ ‘పెద్ది’ సినిమా ఏప్రిల్‌ 30న రిలీజ్‌కు వాయిదా పడింది. వెంటనే…ఈ మంచి రిలీజ్‌ డేట్‌ను పవన్‌కళ్యాణ్‌ ‘ఉస్తాద్‌భగత్‌సింగ్‌’ టీమ్‌ బ్లాక్‌ చేసింది. ఇలా రామ్‌చరణ్‌ రావాల్సిన రిలీజ్‌ స్లాట్‌ పవన్‌ కల్యాణ్‌కు కేటాయించబడింది.

అల్లు అర్జున్‌తో హ్యాట్రిక్‌ మూవీ!

ఇక 2025 జనవరి 10న రిలీజ్‌ కావాల్సిన ‘విశ్వంభర’ మూవీని 2026 వేసవి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లుగా గతంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రకటించారు. కానీ ఈ సమ్మర్‌కు ఆల్రెడీ రామ్‌ చరణ్‌ పెద్ది, పవన్‌కల్యాణ్‌ ‘ఉస్తాద్‌భగత్‌సింగ్‌’ చిత్రాలు రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో, విశ్వం భర సినిమా రిలీజ్‌ను మెల్లిగా జూన్‌కు మార్చారు.

ఇలా తమ సినిమాల రిలీజ్‌డేట్‌ల విషయంలో మెగా హీరోల మధ్య మంచి అండ్‌స్టార్టింగ్‌ ఉన్నట్లుగా ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. ఏదీ ఏమైనా…ఈ ఏడాది మెగా హీరోల నుంచి వరుస సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండటం మాత్రం మెగాఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చే అంశమనే చెప్పాలి.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi