వన్‌ డే బ్రేక్‌…వైజాగ్‌లో అల్లు అర్జున్‌

Viswa
2 Min Read

Web Stories

Raaka Shoot update: ‘రాకా’ సినిమా చిత్రీకరణకు ఒక రోజు బ్రేక్‌ ఇచ్చారు అల్లు అర్జున్‌. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకొనె ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా, జాన్వీ కపూ ర్, రష్మికా మందన్నా, మృణాల్‌ఠాకూర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని, రమ్యకృష్ణ, యోగిబాబు, బాలీవుడ్‌ నటులు షాహిద్‌కపూర్, జిమ్‌సర్బ్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారని తెలిసింది.

AlluArjun Movie News78

ఇట్స్‌ టైమ్‌..ఐ యామ్‌ కమింగ్‌

కాగా, ముంబైలో జరుగుతున్న ‘రాకా’ సినిమా చిత్రీకరణకు ఒక రోజు బ్రేక్‌ ఇచ్చారు అల్లు అర్జున్‌. ఈ బ్రేక్‌ తీసుకుని, వైజాగ్‌ వచ్చి, అక్కడి సాలగ్రామ పురంలోని ఇనార్భిట్‌మాల్‌లోని ఏఏఏ సినిమాస్‌ను లాంచ్‌ చేశా రు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడి, వైజాగ్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని, గంగోత్రితో పాటుగా, తన ఎన్నో సినిమాల చిత్రీకరణలు వైజాగ్‌లో జరిగాయని, వైజాగ్‌తో తనకు వీడదీయలేని అను బంధం ఉందని వ్యాఖ్యానించారు అల్లు అర్జున్‌. గంగోత్రి సినిమా సమయంలో తాను రోడ్లపై తిరిగే వాడి నని, కాకపోతే ఆ సమయంలో ఎవరు తనని పట్టించు కోలేదని, ఇప్పుడు ఒక్కడిగా రోడ్లపై తిరగలేక పోతున్నానని (తన స్టార్‌డమ్‌ను ఉద్దేశించి..) చెప్పారు అల్లు అర్జున్‌. ఇక వైజాగ్‌లోని ఈ ఏఏఏ మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ ఓపెనింగ్‌ కోసం రాకా సినిమా చిత్రీకరణను ఒక రోజు బ్రేక్‌ తీసుకుని, మళ్లీ ముంబై వెళ్లి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటానని అల్లు అర్జున్‌ తెలిపారు. ఈ వేడుకలో తన ఫ్యాన్స్‌తో కలిసి కొన్ని ఫోటోలు దిగారు అల్లు అర్జున్‌. అలాగే ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత– డిస్ట్రిబ్యూటర్‌ భరత్‌నారంగ్, ఏషియన్‌ సునీల్‌ పాల్గొన్నారు.

బరిలోకి దిగుతున్న తండ్రీకొడుకులు

ఇక భారీ బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ‘రాకా’ సినిమా 2027లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్‌ కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్‌ సంగీతం అంది స్తున్నారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu