please subscribe to Tollywoodhub YouTube channel

విలేజ్‌లో రౌడీ జనార్ధన పాలిటిక్స్‌

Viswa
Vijaydevarakonda Rowdy Janardhana Movie Shooting Started

Web Stories

విజయ్‌దేవరకొండ హీరోగా ‘రాజా వారు రాణిగారు’ సినిమా ఫేమ్‌ రవికిరణ్‌ కోలా డైరెక్షన్‌లో రాబోతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తారు. రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ నెల 16 నుంచి ప్రారంభిస్తున్నారు. తొలి షూటింగ్‌ షెడ్యూల్‌లోనే ఈ సినిమాలోని ప్రధాన తారాగాణం పాల్గొంటారని తెలిసింది.

రూరల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీగా ఈ చిత్రం రానుంది. విలేజ్‌ పాలిటిక్స్, ఓ కుర్రాడి అగ్రెసివ్‌నెస్, లవ్‌స్టోరీ, ఫాదర్‌ ఎమోషన్‌..వంటి అంశాల మేళవింపుతో, ఈ సినిమా ఆడి యన్స్‌ను ఆకట్టుకోనుందని తెలిసింది. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోని 15వ సినిమా ఇది. ఇక ఈ సినిమాకు ‘రౌడీ జనార్థన’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా, గతంలో ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన ‘దిల్‌’ రాజు ప్రక టించిన సంగతి తెలిసిందే.

ఇక ఈసినిమాయే కాకుండ, దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌తో విజయ్‌దేవరకొండ ఓ పీరి యాడికల్‌ యాక్షన్‌ సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. రాయలసీమ నేపథ్యంతో, స్వాంతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, ఈ సినిమా రానుంది. ఇందులో విజయ్‌ దేవరకొండ ద్విపాత్రా భినయం చేస్తారనే ప్రచారం సాగుతోంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi