NTR Dragon Release date: ఎన్టీఆర్‌ డ్రాగన్‌ రిలీజ్‌ వాయిదా

Viswa
2 Min Read
NTR Dragon Release date

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఊహించినట్లే జరిగింది. ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్‌’ (పరిశీలనలో ఉన్న టైటిల్‌) సినిమా రిలీజ్‌ డేట్‌ ( Dragon Release date) మారింది. ముందుగా ‘డ్రాగన్‌’ సినిమాను 2026 సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌. సో..డ్రాగన్‌ సినిమాను 2026 జనవరి 9 న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

కానీ ‘వార్‌ 2’ సినిమా చిత్రీకరణతో ఎన్టీఆర్‌ చాలా బిజీ అయిపోయారు. మరోవైపు అనుకున్నదానికంటే ఎక్కువగానే ప్రీ ప్రొడక్షన్‌కు సమయం కేటాయించారు దర్శకుడు ప్రశాంత్‌నీల్‌. దీంతో ఈ సినిమా చిత్రీ కరణ అనుకున్న సమయానికి మొదలు కాలేదు. జనవరి చివర్లో తాను ‘డ్రాగన్‌’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటానని ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమా ప్రమోషన్స్‌లో చెప్పారు.

కానీ ‘డ్రాగన్‌’ సినిమా చిత్రీకరణ, ఎన్టీఆర్‌ లేకుండా ఫిబ్రవరి 20న రామోజీఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. ఏప్రిల్‌ 22న ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ (NTRNeel) షూట్‌లోకి తొలిసారిగా అడుగుపెట్టారు. ఇలా ‘డ్రాగన్‌’ (Dragon Release) సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా, కూడా నాలుగు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ‘డ్రాగన్‌’ రిలీజ్‌ వాయిదా పడుతుందనే అప్పుడే ఊహించారు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఊహించినట్లే…‘డ్రాగన్‌’ సినిమా వచ్చే జనవరి 9 నుంచి జూన్‌ 25కి వాయిదా వేసినట్లు మేకర్స్‌ ఏప్రిల్‌ 29న అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం కర్ణాటకలో డ్రాగన్‌ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్‌ పాల్గొంటుండగా, కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం నైట్‌ సీన్స్‌ తీస్తున్నారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ గోవాలో ఉంటుంది. ఆ పై ఫారిన్‌ వెళ్తారు మేకర్స్‌. దాదాపు పదిహేను దేశాల్లో షూటింగ్‌ జరుపతామని మేకర్స్‌ ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ సమయంలో చెప్పారు.

కన్నడ యాక్టర్‌ రుక్మీణీ వసంత్‌ ఈ మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. మలయాళ యవనటుడు టోవినో థామస్‌ విలన్‌గా చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, మైత్రీమూవీమేకర్స్‌ పతాకాలపై కళ్యాణ్‌ రామ్, కె. హరికృష్ణ, నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవి బస్రూర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *